Home నల్లగొండ పైలట్ ప్రాజెక్ట్‌గా కట్టంగూర్

పైలట్ ప్రాజెక్ట్‌గా కట్టంగూర్

Dharani Website for Land Records of Telangana State

మన తెలంగాణ/కట్టంగూర్‌ః తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల శుద్దీ కరణ అనంతరం సమగ్ర భూవివరాలను ధరణి వెబ్‌సైట్లో నమోదు చేసారు. ఇటీవల నవీకరించిన భూరికార్డుల వివరాలను ఎల్‌ఆర్‌ఇపిలో పొందు పరచి, వాటిని ప్రత్యేకంగా పొందుపరచిన ధరణి వెబ్‌సైట్‌కి అధికారులు అనుసంధానం చేసారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలలో మూడు మండలా ల్లోని తహశీల్దార్ కార్యాలయాలను పైలట్ ప్రాజెక్ట్ కింద రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా ఎంపిక చేసా రు. నల్లగొండ జిల్లాలోని 31 మండ లాలకుగాను కట్టంగూర్ తహశీల్దార్ కార్యాల యంలో నేటినుండి రిజిస్ట్రేషన్లు చేసేందుకు అధి కారులు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నేటి నుండి(19 నుండి) రిజిస్ట్రార్‌గా, తహ శీల్దార్‌కు అదనపు భాద్యతలు అప్పగించ నున్నా రు. తహశీ ల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లను కొనసాగిం చేందుకు తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్, సీనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరు ల కార్యాలయంలో సంబంధిత అధి కారులు శిక్ష ణ ఇప్పించారు. అదేవిధంగా సిసిఎ ల్‌ఏ, నల్ల గొండ, నకిరేకల్ రిజిస్ట్రార్ కార్యాల యాల్లో సంబంధిత కార్యాలయ సిబ్బంది శిక్షణ పూర్తి చేసారు.

గతంలో కట్టంగూర్ మండల ప్రజలు నకి రేకల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకు రిజిస్ట్రేషన్‌కు వెళ్లడంతో దళారీ వ్యవస్థ వల్ల తీవ్ర నష్టం జరిగేది. ఇకనుండి దళారీ వ్యవస్థను నిర్మూ లించి, ప్రజ లకు పారదర్శకతతో కూడిన మెరుగైన సేవలు అం దించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్ర యోగా త్మకంగా తహశీల్దార్ కార్యాలయాల్లో రిజి స్ట్రేషన్ల కు శ్రీకారం చుట్టింది. తహశీల్దార్ కార్యాల యంలోనే రిజిస్ట్రేషన్ సేవలు అందు బాటులోకి వస్తుండడంతో వివిధ గ్రామాల ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రిజిస్ట్రేషన్లు అందుబాటులో… విక్రయ దస్తావేజు(వ్యవసాయ, వ్యవసాయేతర), పార్టిషన్ డీడ్, మార్టిగేషన్ డీడ్‌లతోపాటు పలురకాల రిజిస్ట్రే షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరికరాలతోపాటు సీసి కెమెరా లు కార్యాలయానికి చేరుకున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రి య మొత్తం సీసి కెమెరా నిఘానీడన జరిగేలా అధి కారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. గ్రామీణ ప్రాం తాల్లో మ్యుటేషన్ పెద్దసమస్యగా మారింది. గతం లో రిజిస్ట్రేషన్లు ఒకచోట, మ్యుటేషన్ తహశీ ల్దార్ కార్యాలయాల్లో చేయాల్సివచ్చేది. ఇకపై రెండు సేవలు ఒకేచోట పొందవచ్చు.
దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట
తహశీల్దార్ తిరందాస్ వెంకటేశం
19 నుంచి తహ శీల్దార్ కార్యాల యం రిజిస్ట్రేషన్ కార్యాల యంగా ప్రభుత్వం ఏర్పా టు చేస్తుండ డం తో దళారీ వ్యవ స్థకు అడ్డుకట్ట పడ నుంది. ప్రజలకు, రైతులకు పారదర్శకతతో కూడి న మెరుగైన సేవలు అంద నున్నాయి. మండ లంలోని 18 రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రజలు నేరుగా సంప్రదించి, రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని సద్వి నియోగం చేసుకోవాలి.