Home తాజా వార్తలు ధోని రిటైర్ కావాలనేది తల్లిదండ్రులు కోరిక: కోచ్

ధోని రిటైర్ కావాలనేది తల్లిదండ్రులు కోరిక: కోచ్

Dhoni-Parentsన్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ క్రికెట్ కి గుడ్ బై చెప్పాలని అతని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని కోచ్ కేశవ్ బెనర్జీ తెలిపారు. తాను ధోనీ తల్లిదండ్రులతో మాట్లాడినట్టు కేశవ్ మీడియాతో పేర్కొన్నారు. ధోనీ క్రికెట్ కి వీడ్కోలు చెబితే.. ఇక నైనా తమ కొడుకు తమతో సమయం గడిపే అవకాశం దొరుకుతుందని వారు భావిస్తున్నారని ఆయన చెప్పారు. వారి నిర్ణయంతో తాను ఏకీభవించలేదన్నారు. మరో సంవత్సరం పాటు ధోనీ రిటైర్మెంట్ ఆలోచన విరమించుకుంటే బాగుంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ధోనీ 2020లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదనేది తన నిర్ణయమని కోచ్ కేశవ్ బెనర్జీ చెప్పారు.

Dhoni Parents Want Him to Retire, Says His Coach