Home తాజా వార్తలు బాహుబలి చిత్రాన్ని వీక్షించాను: ఎంఎస్ ధోనీ

బాహుబలి చిత్రాన్ని వీక్షించాను: ఎంఎస్ ధోనీ

Rajamouli-and-Dhoni1హైదరాబాద్: టీమిండియా వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవితం ఆధారంగా తెలుగులో ధోనీ చిత్రం తెరకెక్కుతోంది. శనివారం ఎన్ కన్వెన్షన్‌లో ఎంఎస్ ధోనీ చిత్రం ఆడియోను ధోనీ విడుదల చేశారు. ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తుండగా, ధోని క్యారెక్టర్‌లో సుశాంత్ సింగ్ రాజుపుత్ నటిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో ధోనీ మాట్లాడుతూ… హైదరాబాద్‌కు వస్తే బిర్యాని రుచి చూడాలనిపిస్తోందన్నారు. రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం వీక్షించానని పేర్కొన్నారు. దక్షిణ చిత్ర పరిశ్రమలో నుంచి మంచి చిత్రాలు వస్తున్నాయని ప్రశంసించారు. ఇక్కడి ప్రేక్షకుల స్పందన చూస్తే టీమిండియాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉందన్నారు. హైదరాబాద్‌లో టీమిండియాకు మంచి రికార్డు ఉందని గుర్తు చేశారు. వచ్చే ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా ఉండాలని ధోనీని రాజమౌళి కోరారు.