Home తాజా వార్తలు ధోనీ రిటైర్మెంట్ వార్తలు అవాస్తవం

ధోనీ రిటైర్మెంట్ వార్తలు అవాస్తవం

 dhoni

చివరి వన్డే తర్వాత బంతిని ఎందుకు తీసుకున్నాడో వివరించిన రవిశాస్త్రి
లీడ్స్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇం గ్లాండ్‌తో జరిగిన చివరి వన్డే అనంతరం ఫీల్డ్ అంపైర్ల నుంచి మ్యాచ్ బంతిని తీసుకోవడంపై ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై చెప్పేయబోతున్నాడా అన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దీని పై తాజాగా భారత జట్టు కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇ ప్పట్లో ధోనీ రిటైర్మెంట్ కారని తేల్చి చెప్పాడు. రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ… ‘ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడం లే దు. ఆ వార్తలన్నీ అవాస్తవం. అతను ఎక్కడికీ వెళ్లబోడు. లీ డ్స్‌లో ఇంగ్లాండ్‌తో చివరి వన్డే అనంతరం ధోనీ ఫీల్డ్ అంపైర్లను అడిగి బంతిని తీసుకున్నది నిజమే. ఆ బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించేందుకు మాత్రమే తీసుకున్నాడు. కానీ రిటైర్మెంట్ యోచన ఏది అతడికి లేదు. భరత్‌కు ఆ బంతిని చూపించి మ్యాచ్‌లో పడిన ఇబ్బందులు గురించి చర్చించడానికే ధోనీ అలా చేశాడు. ఇంగ్లాండ్ పిచ్‌లపై అవగాహన కోసమే ధోనీ ఇలా బంతిని తీసుకున్నాడు. వచ్చే ఏ డాది ఇంగ్లాండ్‌లోనే ప్రపంచకప్ జరగనుంది. అంతేకాక త్వ రలో ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ కూడా జరగనుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ధోనీ పరిస్థితులపై బౌలింగ్ కోచ్ భరత్‌తో చర్చించడానికే బంతిని తీసుకున్నాడు’ అని రవిశాస్త్రి వివరించాడు. భారత్-, ఇంగ్లాండ్ మధ్య ఆగస్టు 1 నుంచి తొ లి టెస్టు ప్రారంభంకానుంది. రెండు జట్ల మధ్య మొత్తం ఐదు టెస్టులు జరగనున్నాయి.