Friday, January 27, 2023

లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యంపై మధుమేహ ప్రభావం

- Advertisement -

Sugar-Testరక్తంలో గ్లూకోజ్ అధికస్థాయిలో ఉత్పత్తి అయ్యే స్థితిని మధుమేహంగా పేర్కొంటారు. దీనిని కనుగొనకపోయినా లేదా నియంత్రించక పోయినా, మధుమేహం వల్ల స్వల్పకాలిక (ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం), దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.
ఒకవేళ మధుమేహాన్ని గుర్తించ లేకపోయినా లేదా సరిగా నియంత్రించకపోయినా, మధుమేహం వల్ల అంధత్వం, కిడ్నీల పనితీరు విఫలం అవడం, నాడీ వ్యవస్థకు నష్టం, రక్తప్రసరణ సరిగా జరుగకపోవడం జరుగవచ్చు. దీని వల్ల శరీరం దిగువభాగంలోని అవయవాలు కూడా పనిచేయకపోవడంతో పాటుగా కార్డియో వాస్కులర్ రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. (హర్ట్ ఎటాక్ లేదా స్ట్రోక్).
మధుమేహంతో బాధపడుతున్న రోగులలో అధికశాతం మందికి లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిలో…

  • అంగస్తంభన లేకపోవడం
  • ఆండ్రోజెన్ (లేదా టెస్టోస్టిరాన్) లోపం
  • లిబిడో(లైంగిక కోరిక) తక్కువగా ఉండడం ఉంటాయి.

టైప్ 2 మధుమేహం అనేది మగవారితో పోలిస్తే, మహిళలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. టైప్ 1 మధుమేహం వల్ల స్త్రీ, పురుషులిరువురు సమానంగానే ప్రభావితమవుతారు. అనియంత్రిత మధుమేహం ఉన్న మహిళలు తరచుగా ఈ దిగువ సమస్యలను ఎదుర్కొంటారు:

  • లైంగిక కోరికలు తగ్గడం
  • స్త్రీ జనేంద్రియాల వద్ద లూబ్రికేషన్ గ్గిపోవడం
  • భావప్రాప్తి పొందడంలో సమస్యలతో పాటుగా సంభోగ సమయంలో అధిక నొప్పి
  • మూత్రాశయ సమస్యలు
  • ఇన్‌ఫెక్షన్స్

అందువల్ల మధుమేహంతో బాధపడేవారికి నేరుగా పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్య సమస్యలు రావడంతో పాటుగా వ్యక్తులపై కూడా ప్రభావం కనిపిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగంలోని నిపుణులు, మధుమేహం ఏ విధంగా మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపు తుందనేది తెలుసుకోవడంతో పాటు సరైన సల హాలను అందించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే మహిళలు, వారి భాగస్వామి , కుటుంబ సభ్యులు సరైన నిర్ణయం తీసుకోగలరు. లైంగిక కౌన్సెలింగ్ తో పాటు పునరు త్పత్తి కౌన్సెలింగ్, రక్తంలో చక్కెరను సరైన రీతిలో నిర్వహిం చడానికి తగిన సలహాలను మీ ఫిజీషియన్ సంప్రదించి సల హాలు తీసు కోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles