Home తాజా వార్తలు దసరా కానుకగా డిక్టేటర్ టీజర్

దసరా కానుకగా డిక్టేటర్ టీజర్

Bala-Krishnaనందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా ‘డిక్టేటర్’. సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజులుగా బాలకృష్ణపై వచ్చే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో అజయ్, కబీర్ దుహన్‌సింగ్‌తో పాటు వందమంది ఫైటర్స్ కూడా పాల్గొంటున్నారు. బాలయ్య ఈ వంద మందిని చితకబాదే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. వినాయక చవితి కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్, జై గణేశా సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్ర టీం త్వరలోనే మరో ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది. అదే ‘డిక్టేటర్’ ఫస్ట్ టీజర్. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 21 తేదీ అర్ధరాత్రి టీజర్‌ను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఇటీవలే యూరప్‌లో ఓ మేజర్ షెడ్యూల్‌ను పూర్తిచేసిన ఈ చిత్ర టీం శరవేగంగా షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉంది. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌చౌహాన్ హీరోయిన్లు నటిస్తున్నారు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కోన వెంకట్-గోపిమోహన్‌లు కలిసి కథను అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.