Sunday, March 26, 2023

రాష్ట్రంలో నియంతృత్వ పాలన

- Advertisement -

talk
*ప్రజలను మభ్యపెడుతున్న రాజకీయ పార్టీలు
*రైతులను పట్టించుకోని ప్రభుత్వం
*యువకులకు ఉపాధి కరువు
*సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెర్వుపల్లి సీతారాములు

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి
రాష్ట్రంలో ఏకవ్యక్తి నియంతృత్వ పాలన సాగుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెర్వుపల్లి సీతారాములు అన్నారు. నల్లగొండలో జరుగుతున్న సిపిఎం ద్వితీయ మహాసభల రెండవ రోజు సోమవారం రాజకీయ తీర్మానంపై రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతి, జి ల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డితో కలిసి మీ డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి, కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బిజెపి ఎన్నిక ల్లో సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాలకు పా ల్పడుతున్నందున ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తు న్నారన్నారు. సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ న కోసం బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌కు మద్దతివ్వాలని అన్నారు. బి ఎల్‌పీ ద్వారా రానున్న కాలంలో బూర్జువా పార్టీలకు వ్యతి రేకంగా పోరాడుతామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కీలకమైన వాగ్ధానాలు చేసి వాటిని నెరవేర్చడంలో విఫలమైందని ఆరో పించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా వ్యవసాయా న్ని లాభాల వైపు మళ్లిస్తామన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. పంట ల గిట్టుబాటు ధర, మార్కెట్ వసతి, నాణ్యమైన విత్తనాలను కల్పించలేకపోవడంతో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పేదలకు విద్య, వై ద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సి ఉండగా కార్పొరేట్ శక్తుల పరం చేస్తుందన్నారు. బిసి సబ్‌ప్లాన్, ఎంబి సి నిధులను సక్రమంగా ఖర్చు చేయాలన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయా లని అన్నారు. ప్ర భుత్వ రంగ సం స్థలన్నింటినీ దివాలా తీయించి మూసి వేస్తుండగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల యువ కులకు ఉ పాధి కరువైందని ఆవేద న వ్యక్తం చేశారు. పేద ల సంక్షేమానికి సమగ్ర చర్యలు చేపట్టాల్సి ఉం డగా వృత్తుల వారీగా చేపలు, గొర్రెలు పం పిణీ చేసి పైపై చ ర్యలతోనే సరిపుచ్చుతు న్నారని అన్నారు. టిఆర్‌ఎస్ బిజెపి ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదన్నా రు.

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయో జనాలను, ప్రజల ప్ర యోజనాలను గాలికొదిలి నిస్సిగ్గుగా బిజెపి చర్యలను సమర్థిస్తున్నా రని విమ ర్శించారు. ప్రభుత్వ పాలన వైఫల్యాన్ని ఎండగట్టడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఘోరం గా విఫలమైందన్నారు. పోలీస్ యంత్రాంగానికి ఎనలే ని సౌకర్యాలు కల్పించి నిరసనకారులను నిర్భందానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. సౌకర్యాలను అను భవిస్తున్న పోలీసులు ప్రజలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఇటీవల రాష్ట్రంలో జరిగిన వరుస సంఘటనలు పోలీసుల తీరును తప్పుబడుతున్నాయని అన్నారు. నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో 11 మంది నింధితులు ఉండగా  ఇద్దరిపైనే 302 సెక్షన్ నమోదు చేసి మిగ తా వారిపై బెయిలబుల్ సెక్షన్ పెట్టడంతో వారం రోజుల లోపే విడుదల అయ్యారని, మాదిగలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాని కోరుతూ మందకృష్ణ నిరాహర దీక్ష చేస్తే అరెస్టు చేసి 15 రోజుల వరకు జైలులోనే ఉంచారని ఇది పోలీసుల పనితీరుకు, ప్రజావ్యతిరేక చర్యలకు అద్దం పడుతుందన్నారు.ఈ పార్టీల తీరుతో విసిగి వేసారిన సామాన్య ప్రజలు బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ ద్వారా ఉద్యమానికి సన్నధులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు జ్యోతి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వంలో మధ్యంషాపులను పెంచారని, ఊరూరా వెలసిన బెల్టు షాపులతో మధ్యానికి బానిసలై పురుషులు అర్థాంతరంగా చనిపోతున్నారని, దీంతో ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతుందన్నారు. పిల్లల బాధ్యతను మహిళలే చూసుకోవల్సి వస్తుందని అన్నారు. అన్నింటా మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదని అన్నారు. రాష్ట్రంలో కనీసం సభలు, సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛకూడా కరువైందని అన్నారు. ధర్నాచౌక్‌ను సైతం రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో ఏకపక్ష కుటుంబ పాలన సాగుతుందని విమర్శించారు. ప్రజల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News