Home ఎడిటోరియల్ ఇక అందరూ శతాయుష్కులేనా?

ఇక అందరూ శతాయుష్కులేనా?

Life-expectancyఇరవై ఒకటవ శతాబ్దంలో పుట్టిన పిల్లలు నిండా నూరేళ్ళు బతుకు తారా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వైద్య, ఆరోగ్య రంగాల లో ఈ అంశం మీద జరిపిన పరిశోధనలు ఫలప్రద మయ్యాయని తెలుస్తోంది. జన్యుపరంగా శాస్త్రీయ పరిశోధనలు జరిపి ఆయుర్దాయాన్ని పెంచే ఔషధాలను తయారుచేస్తున్నారట శాస్త్రవేత్తలు. ఈ శతాబ్ది ఆరంభంలో పుట్టిన పిల్లలు కచ్చితంగా పూర్ణాయుష్కులేనట. అంటే నిండా నూరేళ్ళు ఆరోగ్యం గా జీవిస్తారు అని అర్థం. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఈ మేరకు ఒక నివేదికను ఇటీవలే విడుదల చేశారు. మనిషి ప్రస్తుత సగటు ఆయుర్దాయం 66 సం॥లు. 2025నాటికి ఆయుః ప్రమాణం 75 సం॥లకు పెరుగుతుందిట. 2050 సంవత్సరం నాటికి నూరేళ్ళు దాటడం ఖాయమని వాళ్ళ పరిశోధన. ఇప్పుడు పుట్టిన పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడు కుంటూ వస్తే వీరంతా తప్పకుండా నూరేళ్ళు జీవిస్తారని నివేదిక సారాంశం. గతంలో అంటే 50,60 సంవత్సరాల క్రితం జరిపిన అధ్యయనంలో మనిషి సగటు ఆయు ర్దాయం 50 సంవత్సరాల లోపే ఉండేది. వైద్య, ఆరోగ్య రంగంలో చోటు చేసుకున్న పెనుమార్పులు ప్రజల ఆయురారోగ్యాలను గణనీయంగా పెంచాయని సంస్థ డైరెక్టర్ డాక్టర్ హిరోషీ నకజీమా పేర్కొన్నారు. అయితే పేద దేశాల్లో మాత్రం 50 ఏళ్ళు నిండకుండానే మరణించే వ్యక్తుల సంఖ్య పెరుగుతోందని, ప్రతి నలుగురిలో ముగ్గురు అర్ధాయుష్కులుగానే మరణి స్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో మనిషి సగటు ఆయుర్దాయం ఎక్కువగానే ఉన్నదని అన్నారు. అయిదేళ్ళ లోపు మృత్యువాత పడుతున్న శిశువుల సంఖ్య అధికంగా ఉంటోం దన్నారు. ఇంకా అర్థా యుష్కులుగా, అల్పాయుష్కులుగా మరణిస్తున్న వారి సంఖ్యను తగ్గించి, పూర్ణాయుష్కు లుగా తీర్చి దిద్దడం ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందున్న పెనుసవాలు అని స్పష్టం చేశారు.
శతాయుష్కులపై పరిశోధనలు: వైద్య,ఆరోగ్య, ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధితో నిమిత్తం లేకుండా వందేళ్ళు పైబడిన వ్యక్తులు ప్రపంచ వ్యాప్తంగా 53వేల పైచిలుకు ఉన్నారని ఒక పరిశోధనలో తేలింది. 1886 నుండి 1899 మధ్య పుట్టిన వ్యక్తులు సంపూర్ణ ఆరోగ్యం, ఆయుర్దాయంతో జీవించటానికి కారణాలేమి టని ప్రపంచ ఆరోగ్య సంస్థ, జపాన్ దేశ వైద్య, ఆరోగ్య, జన్యుశాస్త్రవేత్తలు తీవ్ర పరిశోధనలు చేస్తున్నారు. మాజీ సోవియట్ రిపబ్లిక్‌లోని జార్జి యాలోని సాచినో అనే కుగ్రామంలో 1880లో జన్మించిన ఆంటిసా కి 132 ఏళ్లు ఆరోగ్యంగా జీవించి మరణించింది. ఆమె ఆరోగ్య రహ స్యాన్ని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు ఆమె శరీరాన్ని భద్రపరిచి ఆమె జన్యువులపై పరిశోధన చేయాలనుకున్నారు. అసలు మనిషి సగటు ఆయుర్దాయం ఎంత? అన్న అంశం మీద ఇప్పుడు పరిశో ధనలు విస్తృత మయ్యాయి. అమెరికా, జపాన్ శాస్త్రవేత్తల బృందం 108 ఏళ్ల వయసు దాటిన వ్యక్తుల జీవన విధా నాన్ని, అలవాట్లను, సంస్కృతి, సంప్రదాయాలను, జన్యువులను, ఆర్థిక, సామా జిక స్థితిగతులను క్షుణ్ణంగా శోధించి, సాధించిన ఫలితాలు ఏమిటంటే ఆ వ్యక్తులు తమ ఆరోగ్యం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసు కోలేదని. 1997 లో ఫ్రాన్స్‌కు చెందిన 122ఏళ్ల జాన్ కాల్మెంట్ అన్న వ్యక్తి మరణించి నప్పుడు అతని జీవనశైలిపై అంత కుముందుగానే పరిశోధనలు చేయడం మొదలు పెట్టిన వైద్యులకు అతని శరీరంలో దీర్ఘకాలం జీవించడానికి దోహదపడే అంశాలేవీ కానరాలేదుట.
జపాన్‌లోని యెషివా విశ్వవిద్యాలయానికి చెందిన అల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో పరిశోధనలు జరుపుతున్న పలువు రు జన్యు శాస్త్ర వేత్తల సిద్ధాంతం ఇలా వుంది. 108 ఏళ్లకు పైబడి జీవి స్తున్న వ్యక్తు లలో చాలామందికి ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు ఉన్నా యని, వారి ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్య సూత్రాల కోవ లోకి ఏ మాత్రం చేరవని తెలిపారు. వారికి వ్యాయామం చేసే అలవాటు అసలే లేదన్నారు. వారి ఆయురారోగ్యాలకు అలవాట్లు, జన్యువులు, సామాజిక స్థితిగతులుకాక మరేదో దోహద పడుతోందని వారి భావన.
దురలవాట్ల ప్రభావంః పొగతాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లు ఆరోగ్యం మీద తప్పక ప్రభావాన్ని చూపుతాయని, అందువల్ల అటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనం టున్నారు లోమా లిండా వైద్య విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ గేరి ఫ్రేజర్. ఆయన చాలా సంవత్సరాలు ‘ఆయుర్దాయం-ఆరోగ్యపు అలవాట్లు’ అన్న అంశం మీద పరిశోధన చేసి శాకాహారం తీసు కోవడం, భోజనా నంతరం వ్యాయామం, దురలవాట్లకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి మంచిదని తేల్చిచెప్పారు. ఆహారంలో తరచుగా బాదం, జీడిపప్పు, వేరుశెనగ పప్పు తినడం కూడా ఆరోగ్యానికి, ఆయుర్దాయం పెరగ డానికి దోహద పడు తుందంటారు. ఇవన్నీ కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన అంశాలంటారు. అయితే, కొన్ని అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఆరోగ్యాన్ని పూర్తిగా అంచనా వేయలే మన్నారు. అయితే, వీరి పరిశోధనలో వెల్లడైన మరో విచిత్రాంశం ఏమిటంటే? ప్రపంచవ్యాప్తంగా దీర్ఘాయుర్దాయం మీద పరిశోధనలు జరుపుతున్న వ్యక్తులు, సంస్థలు దురలవాట్లకు, ఆయు ర్దాయానికి ఏరక మైన లింకు లేదని తేల్చిచెప్పారన్నారు. 108ఏళ్లు దాటిన సుమారు 50వేల మంది స్త్రీ, పురుషులపై జరిపిన పరిశోధనలో అమెరికా, జపాన్ బృందాలు వారి దీర్ఘాయుష్షుకు జన్యువులే మూలకార ణమని తేల్చి చెప్పారు. తర్వాతి స్థానం సామాజిక, ఆర్థిక స్థితిగతులదేనని చెప్పా రు. దీర్ఘాయుష్షుల జాబితాలో మహిళల శాతం ఎక్కువగా ఉందని, అయి తే చిత్రంగా వీరిలో ఆరోగ్యకర జీవనశైలి మాత్రం తమ పరిశోధనలో కనుచూపు మేరలో కనిపించ లేదన్నారు.
మూల హేతువు: న్యూయార్క్‌లో ప్రచురితమవుతున్న ఏజింగ్ ఆరోగ్య పత్రిక తన పరిశోధనలను కొత్త పుంతలను తొక్కించింది. ఈ జర్నల్ మని షి మానసిక స్థితిని పట్టించుకోకుండా మిగిలిన కారణా లను ప్రాతి పదిక గా చూపడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది. వందేళ్ళు జీవించిన వారి వ్యక్తిత్వం మీద కూడా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్య కత ఎంతైనా ఉందని ఈ పత్రిక అభిప్రాయం. ఈ సంచికలో వ్యాసాలు రాసిన శాస్త్రవేత్త లు న్యూయార్క్‌లో 106 సం॥లు పైబడి జీవిస్తున్న వ్యక్తులను కొందరిని గుర్తించి, వారి జీవన శైలితో పాటు మానసికస్థితిని కూడా సునిశితంగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చారు. వారి పరిశీలనలో ఆ వ్యక్తులు ఆరో గ్యంగా, దీర్ఘాయువులై ఉండడానికి కారణం ప్రకృతికి దగ్గరగా జీవిం చడం అని తేల్చింది. మొదటి 40సం॥రాలు వారు చెట్లు, పశుపక్షాదు లతో సన్నిహితంగా మెలగడం కారణమని అన్నారు. ప్రతి చిన్న విష యానికి కుంగిపోకుండా, ప్రకృతిని నమ్ముకొని జీవించడం వారి ఆత్మ స్థైర్యాన్ని పెంచిందన్నారు.
త్వరలో ఔషధాలు!: విచిత్రమేమిటంటే, 70-80 ఏళ్ల వయసులో మరణి స్తున్నవారు అనారోగ్యాలతో మరణిస్తుండగా, 100 ఏళ్ల తరువాత మర ణిస్తున్న వారు ఆరోగ్యంతో మరణిస్తున్నారని బార్జిలాయ్ వ్యాఖ్యానించా రు. తాము వయసుతో ముడిపడి ఉన్న ఆల్జీమర్స్ వంటి అనారోగ్యా లపై పరిశోధనలు చేస్తు న్నప్పుడు ఆయుర్దాయా న్ని పెంచే మందును కూడా అనుకోకుండా కనుగొన్నా మని ఆయన తెలిపారు. వందేళ్లకు మించి ఆరోగ్యంగా బతకడానికి దోహదం చేసే మాత్రను ఇటీవల కని పెట్టామని, దీన్ని రెండేళ్లలో మార్కెట్‌లో ప్రవేశపెట్టడం జరుగుతుం దని, ప్రస్తుతం దీనిని పరీక్షలకు పంపామని ఆయన వెల్లడిం చారు. ఆయన ఇటీవల లండన్‌లో జరిగిన అంతర్జాతీయ స్థాయి డాక్టర్ల సమావేశంలో మాట్లా డుతూ, ఔషధ కంపెనీలు ఈ మాత్రల్ని తయారు చేస్తున్నాయని చెప్పారు. క్యాన్సర్, డయాబెటిస్, మతిమరుపు వంటి అనారోగ్య సమస్య లను కూడా ఆ మాత్ర దరిచేరనివ్వదని ఆయన తెలిపారు. వందేళ్ల తరు వాత కూడా యాభై ఏళ్ల వ్యక్తిలా ఆరోగ్యంగా, చురుకుగా ఉండ డానికి ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. జన్యుకణాల్లో లోపాలున్నా ఆయుర్దా యానికి లోపం లేకుండా ఈ మాత్ర శరీరాన్ని దృఢంగా ఉంచుతుం దని, యాభైఏళ్లు దాటిన తరువాతే ఈ మాత్రను తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా, జన్యుకణాన్ని బట్టి మనిషి ఆయు ర్దాయాన్ని నిర్ణయించగల ప్రక్రియను అమెరికా శాస్త్ర వేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. బోస్టన్‌కు చెందిన జన్యుశాస్త్రవేత్తల బృందం ఈ విషయంలో పరిశోధనలు చేస్తోంది. జన్యుకణాన్ని బట్టి ఆయుర్దా యాన్ని నిర్ణయించిన తరువాత, ఆయుర్దాయాన్ని పెంచగల ప్రక్రియల మీద దృష్టి పెట్టాలన్నదే ఈ శాస్త్రవేత్తలు భావన. – డాక్టర్ వడ్లమాని కనకదుర్గ