Home తాజా వార్తలు భయాందోళనలో పాత పట్టాలు… ఇంకా పట్టాలు రాని రైతులు

భయాందోళనలో పాత పట్టాలు… ఇంకా పట్టాలు రాని రైతులు

Patta Passbooks

 

టేకులపల్లి: కోయగూడెం సింగరేణి ఓపెన్ మైన్ 2002 సంవత్సరంలో ప్రారంభించిన నాటి నుంచి ఈ ప్రాంతం బొగ్గు ఉత్పతులపై సింగరేణి కంపెనీకి అన్ని రీకార్డు స్థాయిలో బోగ్గు ఉత్పతి, లాభాలు వస్తునే ఉన్నాయి. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అపారమైన బొగ్గు నిలువలు ఉన్నాయి అని అందరికి తెలిసినదే కాని మునుముందు కాలంలో ఈ ప్రాంతం నివాసయోగ్యంకాని ప్రాంతంగా మారనుంది. కోయగూడెం ప్రాంతానికి అతి దగ్గరగా త్వరలో ప్రారభించనున్న పిట్ 3 ఓపెన్ గని గురించి , ఆ గని క్రింద భూనిర్వాసితుల గురించి ఒక్క సారి ఆలోచిస్తే రైతుల యొక్క దీనగాధ తెలుస్తుంది.

కోయగూడెం పిట్ 3:
మొత్తం సుమారుగా 3000 ఎకారలలోని భూమి తీసుకోబడుతుంది. దీనిలో పారెస్టు భూమి 1700 ఎకారాలు కాగా, మిగిలిన 1300 ఎకారాల రెవిన్యు భూమి, స్వతంత్రం రాక ముందు నుంచి అట్టి భూములను సాగు చేస్తు జీవిస్తున్న గిరిజనలు, గిరిజనేతరులు వారిలో కొందరికి పాత పట్టాలు ఉన్నాయి. మరి కొందరికి అప్పటి నుంచి సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వలేదు కాని వారి వారసులు ఇప్పటికి ఆ భూములను సాగు చేస్తు జీవిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు, మూడు తరాల వారు అంతరించి పొతున్న వారిని ఎవరు పట్టించుకోరు. అట్టి భూములలో వరి పొలాలు, నీటి చెరువులు, అన్ని పంటలకు యోగ్యమైన భూములు ఉన్నాయి. ఇట్టీ భూమి కోల్పోవడం వల్ల రైతులకు ముఖ్య ఆహారం అయిన వరి ధాన్యం కొనుగోలుకు ప్రతి సంవత్సరం వేరే ప్రాంతాలకు పొవాల్చి ఉంటుంది.

ఈ ప్రాంత రైతుల బాధ కలెక్టర్లుకు కూడా పట్టదా:
ఈ ప్రాంత రైతుల భూముల పట్టాలకై మే 19-2018 నాడు అప్పటి ఎంఎల్ఎ కోరం కనకయ్య, టేకులపల్లి జెడ్పిటిసి లక్కీనేని సురేందర్‌రావులు రైతులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి రైతు బాధలు తెలిపారు. ఆ తర్వాత ఎంఎల్ఎ కోరం, జెడ్పీటిసి లక్కీనేని రైతులతో కలిసి సెప్టెంబర్- 14 – 2018 నాడు ప్రస్తుత కలెక్టర్ రజత్ కుమార్ సైనీను కలిసి రైతు భూముల గురించి తెలిపారు. అయిన ఇప్పటి వరకు రైతులకు పట్టాలు రాలేదు, రైతుబంధు పథకం, రైతు భీమా, రైతు పెట్టుబడి సహాయం అందలేదు. ఇకనైన రైతుల సమస్యలపై ఉన్నత అధికారులు దృష్టిసారించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

ఈ ప్రాంతంలో సింగరేణి సర్వేతో భయంతో బతుకుతున్న రైతులు:
పిట్3 క్రింద భూసర్వే నిర్వహిస్తున్న భూములకు పూర్వ కాలం నుంచి సాగు చేస్తున్న భూములకు పాత పట్టాలు ఉన్న వారి వారసులకు 2018 భూప్రక్షాళనలో పట్టా మర్పిడి జరుగక సింగరేణి వారి నష్ట పరిహార విషయంలో అనేక అపోహాలకు దారి తీస్తుంది. దీనిపై రెవిన్యు, సింగరేణి ఉన్నత అధికారులు దృష్టి పెట్టి రైతులకు ప్రతి ఒక్కరికి పట్టాలు వచ్చేలా చర్యలు చేపట్టాలని, సింగరేణి కంపెనీ ఇచ్చే సహాయ సహాకారాలు పరిపూర్ణంగా అందేలా చూడాలని ఈ ప్రాంత ప్రజల కోరిక.

Did not getting passbooks to Koyagudem peoples