Home తాజా వార్తలు డిఎస్‌పి కార్యాలయంలో డిఐజి ఆకస్మిక తనిఖీ

డిఎస్‌పి కార్యాలయంలో డిఐజి ఆకస్మిక తనిఖీ

Breaking-Newsరంగారెడ్డి: హైదరాబాద్ రేంజ్ డిఐజి అకున్ సబర్వాల్ తాండూరు డిఎస్‌పి కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సోదాలలో భాగంగా కేసుల విచారణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తాండూరు సబ్‌డివిజన్‌లో కేసుల విచారణలో లోపాలున్నాయని, రికార్డుల నిర్వహణ కూడా సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై డిఐజికి రిపోర్టు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్లను వెస్ట్ సైబరాబాద్ కిందికి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే భువనగిరి, యాదగిరిగుట్ట పరిధిలోని 15 పోలీస్‌స్టేషన్లు కూడా సైబరాబాద్ పరిధిలోకి వస్తాయన్నారు. అనంతరం ఆయన డివిజన్ పరిధిలో శిక్షణ పొందుతున్న 15 మంది ట్రైనీ ఎస్‌ఐలతో సమావేశమయ్యారు. ఆయనతోపాటు జిల్లా ఎస్‌పి నవీన్‌కుమార్ కూడా ఉన్నారు.