Wednesday, November 30, 2022

మెట్రో ప్రయాణికులకు డిజిటల్ కనెక్టివిటీ

- Advertisement -

Digital connectivity for hyderabad metro commuters

అనుభవాలను మెరుగుపరుస్తున్న షుగర్ బాక్స్ నెట్‌వర్క్
వినోదం, విద్య విభాగాలకు ఈకామర్స్, ఫిన్‌టెక్ జోడింపు
ఇంటర్నెట్ పై ఆదారపడకుండా ఉచితంగా కంటెంట్ స్ట్రీమింగ్

హైదరాబాద్: ఇంటర్నెట్‌కు వెన్నుముక్కగా నిలిచే హైపర్ లోకల్ ఎడ్జ్ క్లౌడ్ ఆదారిత సాంకేతిక రూపశిల్పి షుగర్ బాక్స్‌నెట్‌వర్క్ ఇప్పడు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం చేసుకుని డిజిటల్ కనెక్టివిటినీ మరింతగా మెరుగుపరుస్తుంది. దేశంలో మొట్టమొదటి ప్రజా రవాణా వ్యవస్దగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రస్తుతం తమ ప్రయాణీకులకు కంటెంట్‌ను ఉచితంగా డౌన్‌లోడ్, స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా అందిస్తుంది. నేడు షుగర్ బాక్స్‌నెట్‌వర్క్, అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో స్టేషన్‌లతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ట్రైన్స్ అన్నింటా కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకవచ్చింది. ఈవేదిక ఉపయోగించి, ప్రయాణీకులు ఇప్పడు వినోదం, విద్య, ఈ కామర్స్, ఫిన్‌టెక్ విభాగాల్లో కంటెంట్‌ను పొందవచ్చన్నారు.

విమానాలలో ఏవిధంగా సేవలు లభ్యమవుతాయో అదే రీతిలో రైలు యాత్రికులకు అత్యుత్తమ అనుభవాలను సృష్టించడం దీని ద్వారా సాధ్యమైతుందన్నారు. ఇటీవల నగరంలో షుగర్ బాక్స్ నెట్‌వర్క్ నిర్వహించిన అధ్యయనంలో మెట్రో రైల్ ప్రయాణీకులు దాదాపు 60 నిమిషాలు తమ ప్లోన్లలోనే ప్రయాణ సమయంలో గడుపుతున్నారని తేలింది. మెట్రోరైట్‌లో ఈసేవలను పరిచయం చేసిన తరువాత షుగర్ బాక్స్ యాప్ రెండవ అత్యంత ప్రాధాన్యతా యాప్‌గా ప్రయాణ సమయంలో నిలిచిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒకరు ఎదుర్కొంటున్న ఇంటర్నెట్ సమస్యకు తగిన పరిష్కారాలను చూపాలని షుగర్ బాక్స్ ప్రయత్నిస్తుంది. ఈ దిశగా తాము మూడు అంశాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేని వారి కోసం ఇతర కనెక్టివిటీ ప్రధాతలతో భాగస్వామ్యం చేసుకుని అందుబాటు ధరలలో ఆధారపడతగిన సేవలను అందిస్తున్నట్లు చెప్పారు.

దీనిపై హైపర్ లోకల్ ఎడ్జ్‌గా వ్యవహరిస్తున్నామని, ఎల్ అండ్ టీ మైట్రో రైల్ వంటి వాటి భాగస్వామ్యంతో ప్రయాణికులకు వారి ప్రయాణి సమయంలో సౌకర్యవంతమైన సేవలను అందించగలుగుతున్నామని షుగర్ బాక్స్ నెట్‌వర్క్ కో ఫౌండర్ రోహిత్ పరాంజసీ పేర్కొన్నారు. అనంతరం ఎల్‌అండ్ టీ, ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ, సీఈవో కెవీబీరెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు అత్యుత్తమ ప్రయాణ అనుభవాలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు, షుగర్ బాక్స్‌తో మా భాగస్వామ్యం ద్వారా స్దిరంగా మా వినియోగదారుల అనుభవాలను వృద్ది చేస్తున్నట్లు వివరించారు. మా వినియోగదారుల లక్ష్యిత కార్యక్రమాలు వృద్ది చేసుకోవడంలో మాకు సహాయపడటంతో పాటు హైదరాబాద్ లాంటి స్మార్ట్ నగరంలో ఆవిష్కరణకు ఓఅద్భుతమైన ఉదాహరణంగా నిలుస్తుందన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles