శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దిల్‌రాజ్ నిర్మించిన తొలి చిత్రం దర్శకుడు వినాయక్‌ను ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సన్మానం చేయించారు. అలాగే దిల్‌రాజు తల్లిదండ్రులను వేదికపై సన్మానించారు. ఈ కార్యక్రమంలో అహోబిల రామానుజీయర్ స్వామి, దేవనాథ రామానుజ స్వామి, దిల్‌రాజు, శిరీష్, ప్రకాష్‌రాజ్, జయసుధ, డా.రవీందర్ రెడ్డి, తనికెళ్ల భరణి, మిక్కీ జె.మేయర్. ఇంద్రజ, సమీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “దిల్‌రాజు దమ్మున్న, ఆరోగ్యకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఆలోచించే సినిమాలు తీస్తున్నాడు. కథను నమ్మి అందుకు తగిన విధంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఎంపికచేసుకొని మంచి నిర్మాతకు నిలువెత్తు నిదర్శనంగా దిల్‌రాజు నిలుస్తున్నాడు. ఇక చిత్ర కథనాయకుడు శర్వానంద్ మా ఇంట్లోనే మా చరణ్‌తో కలిసి పెరిగాడు. చరణ్‌కు తను మంచి స్నేహితుడు. శతమానం భవతి చిత్రంతో శర్వా పెద్ద విజయాన్ని అందుకున్నాడు. తనకు దక్కిన ఈ విజయం నా బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తున్నాను”అని అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “సతీష్ నాకు ఈ కథ చెప్పగానే దాన్ని నేను సినిమాగా కాకుండా జీవితంగా చూశాను. మాతో సహా అందరి జీవితాలు ఇందులో కనిపించాయి. అంతకు ముందు బొమ్మరిల్లు చిత్రంతో ఎలాగైతే కొత్త ఒరవడి మొదలైందో… అలాంటి మరో కొత్త ఒరవడి ఈ చిత్రంతో మొదలవుతుంది. రెండు వారాలైనా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది”అని చెప్పారు. శర్వానంద్ మాట్లాడుతూ “శతమానం భవతి చిత్రం నా కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సినిమా గొప్ప విజయాన్ని అందుకుంది”అని చెప్పారు.
మంచి నిర్మాతకు నిలువెత్తు నిదర్శనం దిల్‌రాజు
- Advertisement -
- Advertisement -