Home వార్తలు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన దిలీప్‌కుమార్

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన దిలీప్‌కుమార్

actor-dilip-kumarబాలీవుడ్ వెటరన్ యాక్టర్ దిలీప్ కుమార్ అస్వస్థతతో ఆస్పతిలో చేరారు. శనివారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు వెంటనే ముంబయ్‌లోని లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. వైద్యులు చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారని దిలీప్‌కుమార్ సతీమణి సైరాభాను తెలిపారు. గత ఏడాది పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న దిలీప్‌కుమార్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. 1940లో కెరీర్‌ను ప్రారంభించిన దిలీప్‌కుమార్ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సినిమాలను నిర్మించారు. ‘అందాజ్’ సినిమాతో నటుడిగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న దిలీప్‌కుమార్ ఆ సినిమాకుగాను ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా సాధించారు. అందాజ్, ఆన్, దేవ్‌దాస్, మొఘల్ ఎ ఆజం, గంగా జమున వంటి విభిన్న చిత్రాలు ఆయన కెరీర్‌లో మరపురాని చిత్రాలుగా మిగిలిపోయాయి. 1994లో సినీ రంగంలో అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు దిలీప్‌కుమార్.