Home ఆఫ్ బీట్ ‘డైన్ విత్ ది డెడ్’

‘డైన్ విత్ ది డెడ్’

dining with the dead new lucky restaurant in ahmedabad

అహ్మదాబాద్: సాధరణంగా మనం ఎదైనా హోటల్ కానీ.. రెస్టారెంట్ కానీ.. వెళ్లినప్పుడు అక్కడ కనిపించేవి టేబుళ్లు, కుర్చీలు, గ్లాసులు, ప్లేట్ లు…. అలాగే సర్వ్ చేసే సర్వర్లు. ఇక ఇటీవల అద్భుతంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న రోబోటిక్ టెక్నాలజీతో కొన్ని చోట్ల రోబోలను కూడా రెస్టారెంట్ యాజమానులు సర్వర్లుగా వాడుతున్నారు. అయితే ఇప్పడు మేము చేప్పబోయే ఓ రెస్టారెంట్ గురించి మీరు వింటే తప్పక ఆశ్చర్యపోకమానరు. ఇదేదో ఖరీదైన, విలాసవంతమైనా రెస్టారెంట్ అయి ఉండవచ్చని మీరు అనుకుంటున్నారు కదూ..! అసలు కాదండీ బాబు.. ఇంకా చెప్పాలంటే మన పాత బస్తీలో ఉండే మాములు కేఫ్ లలానే ఉంటుంది.

అయితే అసలు దాన్ని ప్రత్యేకత ఏమిటనేగా మీ అనుమానం..? కాస్త ఆగండీ అక్కడికే వస్తున్నాం. ముందు మీకు ఈ రెస్టారెంట్ ఎక్కడుందో తెలియాలి. ఎక్కడో కాదు మన భారత్ లోనే అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో ఉంది. దాని పేరు న్యూ లక్కీ రెస్టారెంట్. ఇక ఈ రెస్టారెంట్ ప్రత్యేకత విషయానికి వస్తే… రెస్టారెంట్ నిండా మొత్తం 26 సమాధులు ఉంటాయి. ఇదేంటీ రెస్టారెంట్ అని స్మశానవాటిక గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా..? అదేం కాదు. ముందే చెప్పాం కదా. ఇదే న్యూ లక్కీ రెస్టారెంట్ ప్రత్యేకత. అయితే  సమాధులతో కూడిన ఈ రెస్టారెంట్ కు జనాలు వెళ్తారా? అనేగా మీ అనుమానం. వెళ్లడం కాదు… ఎగబడతారట.

ఇక్కడ టీ తాగితే పనుల్లో సక్సెస్ షూర్…

ఎదైనా పనికి వెళ్లే ముందు ఇక్కడి టీ తాగిన, భోజనం చేసి వెళ్లిన ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుందట. ఇది మేం చెబుతుంది కాదు.. అక్కడి జనాలే స్వయంగా చెబుతున్నారు. అందుకే ఇది అక్కడి జనాలకు లక్కీ రెస్టారెంట్ గా మారిపోయింది. సూమారు 40 ఏళ్లుగా ప్రజలు ఇక్కడి సమాధుల మధ్యే టీ, కాఫీ, భోజనం చేస్తూ ఏంజాయ్ చేయడంతో పాటు తమ పనుల్లో సక్సెస్ సాధిస్తున్నారు మరి. ఇక ఈ రెస్టారెంట్ పని చేసే వారు కూడా ఈ సమాధులను అంతే శ్రద్ధగా చూసుకుంటారు. ప్రతి రోజు ఉదయం రెస్టారెంట్ తెరవగానే మొత్తం శుభ్రం చేయడంతో పాటు 26 సమాధులను కూడా తూడిచి, వాటిని అందమైన వస్త్రాలతో అలంకరిస్తారట. ఆ తర్వాత వాటిపై పూలు వేసి ముస్తాబు చేస్తారు. ఇలా ప్రతి రోజు వారి దినచర్య మొదలవుతుంది.

ఇక  కస్టమర్లు వచ్చి ఆర్డర్లు ఇవ్వడమే ఆలస్యం సర్వర్లు వెంటనే వారి వద్దకు వెళ్లిపోతారు. వారికి ఆ సమాధులు ఎంతగా అలవాటు పడిపోయాయి అంటే ఒక్కసారి కూడా వారు వాటి వల్ల ఇబ్బంది పడకపోగా.. ఏదో ఓపెన్ ప్లేస్ లో ఉన్నట్టు రెస్టారెంట్ మొత్తం ఫ్రీగా తీరుగుతుంటారట. ఇక రెస్టారెంట్ యాజమాని కూడా రోజు రాగానే ప్రతి సమాధి వద్ద అగర్ బత్తి ముట్టించాకే కౌంటర్ పై కూర్చుంటారట. ఈ రెస్టారెంట్ తనకు ఎంతో కలిసి వచ్చిందని యాజమాని అంటున్నాడు. అంతేకాదట చాలా దూరప్రాంతాల నుంచి జనాలు ఇక్కడి టీ, కాఫీ, భోజనాల రుచి చూడడానికి వస్తుంటారని యాజమాని చెబుతున్నాడు.

ఎలా  ప్రారంభమైంది… 1950లో ఈ రెస్టారెంట్ కి బీజం పడింది. కాలికట్ నుంచి వచ్చిన కెహెచ్ మహ్మద్ అనే వ్యక్తి లాల్ దర్వాజ ప్రాతంలో 16వ శతాబ్దానికి చెెందిన ఓ సూఫీ సన్యాసి సమాధి పక్కన ఒక చిన్న ‘టీ’ కొట్టు పెట్టాడు. ఆ సమాధి వల్ల మహ్మద్ కు బాగా కలిసి వచ్చింది. దాంతో అతి తక్కువ సమయంలోనే అతని టీ కొట్టు బాగా పాపులర్ అయింది. జనాలకు కూడా ఆ టీ కొట్టు లక్కీగా మారిపోయింది. దీంతో తక్కువ కాలంలోనే ఆ చిన్న టీ కొట్టు కాస్త రెస్టారెంట్ గా అవతరించింది. ఇక మహ్మద్ తనకు ఇంతల కలిసి వచ్చిన సమాధులను వదిలిపెట్టలేదు. కస్టమర్లు బాగా వస్తుండడంతో ఆ 26 సమాధులను యాజమాని ఏంతో భక్తి శ్రద్ధలతో చూసుకుంటున్నాడు. కస్టమర్లు కూడా తమకు సక్సెస్ చూపిస్తున్న లక్కీ రెస్టారెంట్ అంటే ఏంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి రోజు ఇక్కడే చాయ్ తాగి తమ పనులకు వెళ్తుంటారు. ఇలా సమాధుల మధ్యన ఉన్న రెస్టారెంట్ ఇండియాలో ఇది ఒక్కటే కావడం విశేషం. అంతేందుకు బహుషా ప్రపంచంలోనే మొదటి రెస్టారెంట్ ఇదే కావొచ్చు.

లక్కీ రెస్టారెంట్ కు ఎంఎఫ్ హుస్సేన్ రాకతో మరింత ఫేమస్… 

ప్రముఖ చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ కూడా ఒకసారి ఇక్కడికి వచ్చారట. ఆయన ఇక్కడ టీ తాగుతూ కొన్ని చిత్రాలు గీసి యాజమాని మహ్మద్ కు గిప్ట్ గా ఇచ్చారు. వాటిని ఆయన రెస్టారెంట్ గొడలపై పెట్టారు. హుస్సేన్ వచ్చిన్నప్పటి నుంచి న్యూ లక్కీ రెస్టారెంట్ ఇంకా ఫేమస్ అయిపోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. సమాధుల వద్ద జనాలు బాధపడుతూ కనిపించడం కామన్ గా చూస్తుంటాం. కానీ ఒక్క న్యూ లక్కీ రెస్టారెంట్ కి మాత్రమే సమాధుల పక్కన ప్రజలు సంతోషంగా ఆహ్లదకరంగా టీ తాగుతూ భోజనం చేస్తూ కనిపిస్తారు. అంతేకాదు ఈ సమాధులు అక్కడి ప్రజలు, రెస్టారెంట్ సిబ్బంది జీవితాల్లో భాగమైపోయాయి. అలాగే వారికి లక్కీగా కూడా మారిపోయాయి.

మన ఇండియాలోనే మరికొన్ని సమ్ థింగ్ స్పెషల్ అనిపించే రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో మన హైదరాబాద్ లోని TASTE OF DARKNESS ( చీకటిలో భోజనం రుచి చూడడం). అలాగే చెన్నైలోని ఖైదీ కిచెన్.. ఇక్కడ మీరు జైల్లో భోజనం చేసే అనుభూతిని పొందుతారు. ఇక అహ్మదాబాద్ లోని నేచురల్ టాయిలెంట్ కెఫే… ఇక్కడ టెబుళ్ల ముందు టాయిలెంట్ బెసిన్ మాదిరిగా కూర్చీలను ఏర్పాటు చేశారు.