- Advertisement -
శాస్త్రవేత్తలు 1980 సంవత్సరంలో జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత-గోదావరి లోయలోని అన్నారం అనే గ్రామానికి దక్షిణాన కిలోమీటరు దూరంలో ఓ రాక్షసబల్లి(డైనోసార్) అవశేషాలను గుర్తించారు. అప్పటి నుంచి కొనసాగిన పరిశోధనలు తాజాగా పూర్తయ్యాయి. ఈ పరిశోధనల్లో ఆ రాక్షసబల్లి వయసు 22.9-23.3 కోట్ల సంవత్సరాల మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారణ చేశారు. ఆ అవశేషాలు ట్రయాసిక్ యుగంలో జీవించిన హరేరాసారియా వర్గానికి చెందినదిగా శాస్త్రవేత్తలు తేల్చారు. ఇది మాంసాహార డైనోసార్ అని, దీనికి ‘మలేరీరాప్టర్ కుట్టీ’ అని పేరు పెట్టారు .మంచు యుగం, రాతి యుగం నాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమైన తెలంగాణ ఇప్పుడు మరో ప్రాచీన యుగానికి నిలయమని తేలింది.
- Advertisement -