Tuesday, February 7, 2023

దర్శకుడు రాఘవేంద్రరావు దిష్టిబొమ్మ దహనం

- Advertisement -

K-Raghavendra-Rao-ONVకరీంనగర్ : దర్శకుడు కె. రాఘవేంద్ర రావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న నాల్గవ భక్తి చిత్రం ‘ఓం నమో వెంకటేశాయా’. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందానికి నిరసన సెగ తగిలింది. తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరాం బాబా జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆయన పేరు ఎందుకు పెట్టలేదని గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి. అంతకు ముందు ఈ హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన అన్నమయ్య, శ్రీరామదాసు జీవితగాథల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలకు అవే పేర్లు పెట్టినప్పుడు.. హాథీరాం బాబా జీవితంపై తెరకెక్కుతున్న చిత్రానికి ‘ఓం నమో వెంకటేశాయా’ అని టైటిల్ పెట్టడమేమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందే తిరుమల శ్రీవారి పాదాల వద్ద ఆందోళన చేసిన గిరిజన విద్యార్థి సమాఖ్య నాయకులు తాజాగా కరీంనగర్‌లో దర్శకుడు రాఘవేంద్రరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. విడుదల సమయం దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి నిరసనలను చిత్ర బృందం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles