Friday, April 26, 2024

గ్రాండ్‌గా పూరి బర్త్‌డే సెలబ్రేషన్స్

- Advertisement -
- Advertisement -

Director Puri Jagannadh birthday celebrations

 

యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ,- డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైగర్’. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. మంగళవారం దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘లైగర్’ సెట్‌లో పూరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకల్లో చిత్ర యూనిట్ సమక్షంలో బర్త్ డే కేక్ కట్ చేశారు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. హీరో విజయ్ దేవరకొండ, ఛార్మి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌కు ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్ చెప్పారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News