Home Default డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్

డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్

Director Puri Jagannath Attend Before ED In Drugs Caseహైదరాబాద్ : టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు లో ఈడీ విచారణను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి తెలుగు నటీనటులను ఈడీ విచారిస్తోంది. సోమవారం ఈడీ విచారణకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరయ్యారు. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు పూరీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 10.05 గంటలకే ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు పూరీ నిరాకరించారు. సోమవారం సాయంత్రం వరకు ఈడీ అధికారులు పూరీని విచారించే అవకాశం ఉంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల టీం పూరీని విచారించనుంది. సెప్టెంబర్ 22వరకు ఈడీ విచారణకు హాజరయ్య  నటీనటుల వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం పూరీ విచారణకు హాజరు కాగా, సెప్టెంబర్ 2న ఛార్మీ, సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న  రవితేజ, శ్రీనివాస్, సెప్టెంబర్ 13న నవదీప్‌ , సెప్టెంబర్ 13న  ఎఫ్‌ క్లబ్‌ జీఎం, సెప్టెంబర్ 15న ముమైత్‌ ఖాన్‌ , సెప్టెంబర్‌ 17న తనీష్‌ , సెప్టెంబర్ 20న నందు, సెప్టెంబర్ 22న తరుణ్ లు ఈడీ విచారణకు హాజరు కానున్నారు.