Home తాజా వార్తలు ఆర్ఆర్ఆర్ : లోకేషన్ల వేటలో రాజమౌళి

ఆర్ఆర్ఆర్ : లోకేషన్ల వేటలో రాజమౌళి

Director Rajamouli Searching for Locations For RRR Movieహైదరాబాద్ : ఆర్ఆర్ఆర్ మూవీ కోసం తెలంగాణలో లోకేషన్ల కోసం దర్శకధీరుడు రాజమౌళి అన్వేషణ చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్ టిఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పూణేలో కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా దీనికి ఆటంకం ఏర్పడింది. కరోనా కారణంగా గత మూడు నెలలుగా షూటింగ్ నిలిచిపోవడం, హైదరాబాద్ దాటి వెళ్లలేని పరిస్థితులు ఎదురుకావడంతో రాజౌమళి ఈ సినిమా షూటింగ్ ను తెలంగాణలోనే చేయాలని నిర్ణయించుకున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాజమౌళి తెలంగాణలో లోకేషన్స్ వెతికే పనిలో ఉన్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్ టిఆర్, రామ్ చరణ్ , అజయ్ దేవగణ్ కాంబినేషన్ లో తీసే సన్నివేశాల కోసం సెట్స్ వేయకుండా రియల్ లొకేషన్ల కోసం రాజమౌళి వెతుకున్నారట. ఈ సన్నివేశాలు చిత్రీకరించేందుకు నల్లగొండలోని కోటలను రాజమౌళి పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ అంశంపై రాజమౌళి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. అన్ని సజావుగా సాగితే వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.