Home తాజా వార్తలు మీ పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి పుకార్లు: విజయేంద్ర ప్రసాద్

మీ పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి పుకార్లు: విజయేంద్ర ప్రసాద్

Vijayendra-Prasad

హైదరాబాద్: వెబ్‌సైట్లు పబ్బం గడుపుకోవడానికి లేనిపోని వార్తలను ప్రచారం చేస్తున్నాయంటూ దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కించబోతున్న మరో అద్భుత దృశ్యకావ్యం మహాభారతం అని గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వార్త వైరల్ అవ్వడంపై ఆయన ఈ విధంగా స్పందించారు.

ఇవన్నీ కేవలం రూమర్లేనని, ఇంకా చెప్పాలంటే వెబ్‌సైట్ల సృష్టి అని అసహనం వ్యక్తం చేశారు. అసలు మహాభారతాన్ని మూవీగా తీయాలనే ఆలోచన రాజమౌళికి గానీ తనకు గానీ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజమౌళి ప్రతి క్షణం బాహుబలి-2 కోసమే కేటాయిస్తున్నారని చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్ 28న బాహుబలిని విడుదల చేయడంపైనే తాము దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చారు. అంతేగాని మహాభారతానికి సంబంధించి తాము ఏనాడు ఆలోచించ లేదన్నారు. ఇప్పటికైన వెబ్‌సైట్లు ఇలాంటి పుకార్లును కట్టిబెట్టి పనికి వచ్చే సమాచారం ప్రచురించికోవడం మంచిదని హితవు పలికారు.