Home Default చైతూకు దర్శకుడి షరతు నిజమేనా…?

చైతూకు దర్శకుడి షరతు నిజమేనా…?

Director Vikram Kumar conditions for Naga Chaitanyaహైదరాబాద్ : హీరో అక్కినేని నాగచైతన్యకు దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ కండీషన్ పెట్టారట. చైతన్య, పరుశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ప్రస్తుతం చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ’లవ్ స్టోరీ‘ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సినిమా చేద్దామని చైతన్య డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్‌ను అడిగాడట. ఈ క్రమంలో చైతన్యకు విక్రమ్ కుమార్ ఓ షరతు విధించాడట. తన సినిమాలో సమంత నటిస్తేనే ,  తాను దర్శకత్వం వహిస్తానని చైతన్యకు విక్రమ్ కుమార్ తేల్చి చెప్పాడట. విక్రమ్ కుమార్ షరతుకు చైతన్య కూడా అంగీకరించినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ’ఓ బేబీ‘ తరువాత సమంత మరో సినిమాకు సంతకం చేయలేదు. అయితే ప్రముఖ దర్శకుడు ఒకరు తీసే పాన్ ఇండియా సినిమా చేసేందుకు సమంత అంగీకరించిందని వార్తలు వినిపిస్తున్నాయి. చైతన్యకు జోడీగా మరోమారు నటించేందుకు సమంత అంగీకరిస్తుందో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.  చివరగా ’మజిలీ‘ సినిమాలో చైతన్య, సమంతలు జంటగా నటించిన విషయం విదితమే.