Home జాతీయ వార్తలు దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి

Ramnath-Kovind

ఢిల్లీ : దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి పథకం ద్వారా 2022 నాటికి 25 లక్షల మంది దివ్యాంగులకు ఉపాధి లభించనుందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రీయ ప్రరోద్యోగి సంస్థాన్ కురుక్షేత్ సహకారంతో కేంద్రం దివ్యాంగ యువతీ యువకుల కోసం జాతీయ స్థాయిలో ఐటి పోటీలు నిర్వహించిందని, ఇందులో విజేతలైన వారు వియత్నాంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో వ్యక్తిగత విభాగంలో భారత్‌కు మూడు పతకాలు తెచ్చారని ఆయన కొనియాడారు. రాష్ట్రాలు కూడా ఇటువంటి పోటీలు నిర్వహించాలని రాష్ట్రపతి సూచించారు. దివ్యాంగులకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాలకు చెందిన వారికి రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణకు చెందిన దేవనార్ ఫౌండేషన్ నిర్వాహకుడు సాయిబాబాగౌడ్ ఈ అవార్డు అందుకున్నారు.

Disabled should go forward with the Spirit