Thursday, April 18, 2024

మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న ‘డిస్కో రాజా’

- Advertisement -
- Advertisement -

Disco raja

 

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్కో రాజా’ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈనెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ “ప్రేక్షకులు అందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా ‘డిస్కో రాజా’. బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. వి.ఐ.ఆనంద్ సినిమాను బాగా తీశాడు.

వెన్నెల కిషోర్, సునీల్, బాబీ సింహతో పనిచేయడం మంచి అనుభవాన్నిచ్చింది. ఈ సినిమాలోని ముగ్గురు హీరోయిన్లు నభా నటేష్ , పాయల్ రాజ్‌పుత్, తాన్య బాగా నటించారు. తమన్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది”అని అన్నారు. డైరెక్టర్ విఐ. ఆనంద్ మాట్లాడుతూ “నేను బిగ్ స్టార్‌తో చేస్తున్న సినిమా ఇది. ప్రతి డైరెక్టర్ రవితేజతో సినిమా చేయాలి. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. బాబీ సింహ, పాయల్, సభా నటేష్ సహా అందరు నటులు బాగా చేశారు.

ప్రేక్షకులు కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి”అని చెప్పారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “సినిమా ట్రైలర్ సూపర్బ్‌గా ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.వి.వినాయక్, గోపీచంద్ మలినేని, సభా నటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Disco raja pre release event
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News