Home మంచిర్యాల బ్లాక్ మార్కెట్‌కు రాయితీ సిమెంట్

బ్లాక్ మార్కెట్‌కు రాయితీ సిమెంట్

Discounted cement for black market

ప్రభుత్వ పనుల సిమెంట్‌ను అమ్ముకుంటున్న అక్రమార్కులు
నాన్ ట్రేడింగ్ ద్వారా తక్కువ ధరకు పొందుతున్న కాంట్రాక్టర్లు
చెక్ పోస్టుల కళ్లకు కాసుల గంతలు
యథేచ్ఛగా పొరుగు రాష్ట్రంలో విక్రయాలు
మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం

మన తెలంగాణ/మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులకు రా యితీపై అందజేస్తున్న సిమెంట్ మహారాష్ట్రకు యథేచ్చగా తరలిపోతుంది. నాన్ ట్రేడింగ్ ద్వారా ప్రభుత్వం కాంట్రాక్టర్‌లకు రాయితీపై సిమెంట్‌ను అందజేస్తుండగా కాంట్రాక్టర్‌లు 50 శాతం రెట్టింపు ధరలకు పొరుగు రాష్ట్రంలోని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రాయితీ సిమెంట్‌ను కాంట్రాక్టర్‌లు వ్యాపారులకు విక్రయిస్తుండగా మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మార్గంలో వే ర్వేరు చోట్ల ఉన్న చెక్‌పోస్టుల కళ్లకు కాసుల గంతలు కట్టి నిరాటంకంగా తరలిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లకు అలవాటుపడి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో 200 ప్రభు త్వ రాయితీ సిమెంట్ బస్తాలను స్వాధీనం చే సుకున్నారు. ఇటీవల చింతలమానెపల్లి, దహె గాం, కౌటాల, బెజ్జూర్ మండలాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో నిషేధిత గుట్కాలతో పాటు గుడుంబా నల్ల బెల్లంతో పాటు సిమెంట్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు, భవనాలకు వివిధ నిర్మాణాలకు రాయితీపై కాంట్రాక్టర్‌లకు అందజేస్తున్న సిమెంట్‌ను పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు అన్ని రకాల అనుమతులతో దుకాణా దారులు ట్రేడింగ్ ద్వారా సిమెంట్‌ను విక్రయిస్తుండగా ప్రభుత్వం కల్పించిన రాయితీ సిమెంట్‌ను కాంట్రాక్టర్‌లు నాన్ ట్రేడింగ్ ద్వారా పొందుతున్నారు. బయట మార్కెట్‌లో సిమెంట్ బస్తా ఒకటి రూ.300లు ఉండగా కాంట్రాక్టర్‌లకు రాయితీ రూ.150కే సరఫరా చేస్తున్నారు. రాయితీ సిమెంట్ బస్తాలపై కంపెనీ పేరుతో పాటు నాట్‌ఫర్ సేల్ అనే ముద్ర కూడా ఉంటుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతుండగా ప్రభుత్వం సిమెంట్‌ను సరఫరా చేస్తుండగా రాయతీని కొల్లగొట్టె విధంగా కాంట్రాక్టర్‌లు మహారాష్ట్రలో విక్రయాలకు పాల్పడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో మహారాష్ట్రకు చెందిన గ్రామాలు ఉండడం వల్ల కాంట్రాక్టర్‌లు యదేచ్చగా రాయితీ సిమెంట్‌ను పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఒక్కొక్క లారీలో 15 మెట్రిక్ టన్నులు అనగా 420 బస్తాలు నింపి లారీలో ప్రతినిత్యం మహారాష్ట్రకు తరలిస్తూ కోట్లాది రూపాయల్లో ప్రభుత్వ రాయితీ గండికొడుతున్నారు. వాంకిడి సమీపంలో చెక్‌పోస్టు ఉండగా కాసుల తో వారి కళ్లు కట్టేస్తున్నారు. ప్రతి అక్రమానికి ఒక ధరను నిర్ణయించి వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాంకిడిలోని వాణిజ్య పన్నుల చెక్‌పోస్టులో గతంలో ఏసిబి అధికారులు సైతం దాడులు చేసి, అధికారులను సస్పెండ్ చేశారు. కొమురంభీం జిల్లాలోని వాంకిడి ఇందాని నుంచి సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్ మండలాలకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు ఉండడం వల్ల ఈమార్గాల నుంచే యదేచ్చగా సిమెంట్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జమ్మికుంట, పెద్దపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి)లమీదుగా రైళ్ల ద్వారా మహరాష్ట్రలోని బల్లార్ష, చంద్రపూర్‌లకు త రలిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమంగా తరలిపోతున్న ప్రభుత్వ రా యితీ సిమెంట్ పై దృష్టిని కేంద్రీకరించినట్లయితే కోట్లాది రూపాయల కుంభకో ణం వెలుగుచూసే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా ప్రభుత్వం ఇస్తున్న కో ట్లాది రూపాయల రాయితీ పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.