Thursday, April 25, 2024

మేక్ ఇన్ ఇండియా తరహాలో డిస్కవరీ ఇన్ ఇండియా

- Advertisement -
- Advertisement -

ktr

 

బయో ఏసియా సదస్సులో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : మేక్ ఇన్ ఇండియా మాదిరి డిస్కవరీ ఇన్ ఇండియా తీసుకురావాలని రా ష్ట్ర పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బయో ఏసియా అ ంతర్జాతీయ సదస్సు రెండవరోజు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీ యూష్ గోయల్, మంత్రి కెటిఆర్ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ‘ భారతదేశం 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆ ర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్షంగా పెట్టుకున్న నేపథ్యంలో దేశీయ ఫార్మా, బయోటిక్ పరిశ్రమ అభివృద్దిని ఎలా చూ స్తారని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. అలాగే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ల మధ్య సమన్వయ లోపం, ప్రో త్సాహాకాల ఉపసంహరణ, ఔషధాల ధరల నియంత్రణ వంటి విషయాల ను కెటిఆర్ ప్రస్తావించారు.

ఈ అంశాలపై పీయూష్ గోయల్ మట్లాడుతూ భవిష్యత్తులో దేశీయ ఫా ర్మా, బయోటెక్ పరిశ్రమల వృద్ధి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రెండు పరిశ్రమల అభివృద్ధి 40 మిలియన్ డాలర్లుగా ఉందన్నారు. కరోనా వైరస్ ఉన్నప్పటికీ 10 శాతం సిఎజిఆర్ నమోదైందని మం త్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఫార్మా రంగ పరిశ్రమలను పునర్నిర్వచించేందుకు ప్రోత్సహం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఫార్మా, బయోటిక్‌లో పేటెంట్‌లను రికార్డు స్థాయిలో ఆమోదం తెలిపే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. అలాగే, ఔషధాలు, వైద్య పరికరాల ధరల నియంత్రణలోనూ ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

వచ్చే నెల రెండో వారంలో ఫార్మారంగం పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ భేటిలో తమ దృష్టికి వచ్చిన ఫార్మా, బయోటిక్ రంగ సమస్యలన్నింటిపై చర్చించి, పరిష్కార మార్గాలపై దృష్టి సారిస్తామన్నారు. ఇదిలా ఉండగా జినోమ్ వాలీ ఎక్సలెన్స్ అవార్డు 2020 ను నోవార్టీస్ సిఇఓ డా. వాస్ నరసింహన్‌కు మంగళవారం అందించారు. ఈ కార్యక్రమంలో ఫార్మా, బయోటెక్ రంగ పరిశ్రమలకు చెందిన సిఇఓలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Discovery in India along the lines of Make in India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News