Friday, March 29, 2024

నేడు భారత్-చైనా అధికారుల చర్చలు

- Advertisement -
- Advertisement -

Discussions with India-China officials today

న్యూఢిల్లీ: లడఖ్ ప్రాంతంలో భారత్ చైనా సైన్యాల మధ్య గత నెల రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా శనివారం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య తొలి విడత చర్చలు ప్రారంభం కానున్నాయి. భారత బృందానికి లే కేంద్రంగా ఉన్న ఆర్మీకి చెందిన 14 కోర్ దళం చీఫ్( జిఓసి) లెఫ్టెనెంట్ జనరల్ హరిందర్ సింగ్ నాయకత్వం వహించనుండగా, చైనా బృందానికి ఇదే ప్రాంతంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ లియులిన్ నాయకత్వం వహిస్తున్నారు. తూర్పు లడఖ్ లోని చుషుల్ సెక్టార్‌లోని మాల్డోలోని సరిహద్ద భద్రతా సిబ్బంది మీటింగ్ పాయింట్ ఈ చర్చలు ప్రారంభం అవుతాయి.

Discussions with India-China officials today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News