Friday, April 19, 2024

ఈసారి కరోనాను మించిన మహమ్మారి ‘డిసీజ్‌ఎక్స్’ ?

- Advertisement -
- Advertisement -

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 66 లక్షల మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. దానికి విరుగుడు వ్యాక్సిన్ కనుగొనడంతో కొవిడ్-19 కోరల నుంచి ప్రజానీకం చాలా వరకు బయటపడింది. అయితే రాబోయే కాలంలో కరోనాకు మించిన ప్రాణాంతక వ్యాధి ప్రబలనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఆఫ్రికా దేశాల్లో మార్బర్ అనే వైరస్ కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. దానిని కట్టడి చేయకపోతే ప్రపంచమంతా విస్తరించగలదని తెలిపింది. ప్రస్తుతానికి దానికి ‘డిసీజ్‌ఎక్స్’ అని పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ వ్యాధి సోకిన వారిలో 80 శాతం మంది మరణిస్తారు. కరోనాను మించిన ప్రాణ నష్టం ఈ వ్యాధి వల్ల జరగొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి డిసీజ్‌ఎక్స్‌కు మందు లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News