Home తాజా వార్తలు ఎన్‌కౌంటర్ చేయడం బాధలేదు…

ఎన్‌కౌంటర్ చేయడం బాధలేదు…

disha-case

హైదరాబాద్: ఎన్‌కౌంటర్ చేయడం తమకు ఏమాత్రం బాధించడం లేదని, చనిపోయే ముందు చివరి చూపు చూడలేదన్నదే ఆవేదన మాత్రమే ఉందని ‘దిశ’ హత్య కేసు ఎన్‌కౌంటర్‌లో మృతుడు శివ తండ్రి రాజప్ప మీడియాతో పేర్కొన్నాడు. ఎన్‌కౌంటర్‌చేయడంపై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అయితే కనీసం చివరిసారిగా ముఖం చూపించకుండా, మాట్లాడనీయకుండా ఎన్‌కౌంటర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితులను చంపుతామని పోలీసులు తనకు చెప్పినా బాధ ఉండదన్నారు. కానీ చివరిసారిగా ఒకసారి మాట్లాడించి, ముఖం చూపిస్తే బాగుండేదని.. ఆ విధంగా లేకుండా చేశారన్నారు. పోలీసులు ఇంటికొచ్చి విచారణ చేసినప్పుడు కూడా ఉరిశిక్ష వేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పామన్నారు. కనీసం తమతో ఒకసారి మాట్లాడించినట్లయితే సంతోషంగా ఉండేదన్నారు.

disha case accused a2 shiva father response encounter