Tuesday, May 30, 2023

‘మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్‌’గా దిశా ప‌టానీ..

- Advertisement -
- Advertisement -

తన అందాలతో అభిమానుల్లో హీట్ పుట్టిస్తున్న బాలీవుడ్ హాట్ భామ దిశా పటానీ ‘ది టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలతో ప్రతి యేడాది ఈ జాబితాను ప్రకటిస్తుంది. తాజాగా విడుదల చేసిన ఈ జాబితాలో దిశా పటానీ నెం.1 స్థానాన్ని దక్కించుకుంది.గ‌త ఏడాది 9వ స్థానం సాధించిన దిశా ఈ ఏడాది అగ్ర స్థానానికి చేరుకోవ‌డం విశేషం.

ఈ జాబితాలో 2వ స్థానంలో సుమన్ రావ్ నిలువగా.. ఆ తర్వాతి స్థానాల్లో కత్రీనా కైఫ్, దీపికా పదుకునే, వర్తికా సింగ్, కైరా అద్వానీ, శ్రద్దా కపూర్, యామీ గౌతమ్, అదితి రావు హైదరీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాంటి బాలీవుడ్ అందాల భామలు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. కాగా, ఇటీవల ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి మూడో స్థానంలో దక్కించుకున్నాడు.

Disha Patani gets no 1 rank in Most Desirable woman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News