Friday, April 19, 2024

భార్యపై చేయిచేసుకున్న ఐపిఎస్ అధికారికి ఉద్వాసన

- Advertisement -
- Advertisement -

Dismissal of IPS officer for assaulting wife

 

మధ్యప్రదేశ్ సిఎం ఆదేశాలు

భోపాల్: తన భార్యపై దౌర్జన్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐపిఎస్ అధికారి, మధ్యప్రదేశ్ డిజిపి(ప్రాసిక్యూషన్) పురుషోత్తమ్ శర్మను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రకటించారు. పురుషోత్తమ్ శర్మ తన భార్యపై చేయిచేసుకుంటుండగా ఆమె ఆ దాడిని ప్రతిఘటిస్తున్న దృశ్యం ఈ వీడియోలో రికార్డయింది. శర్మను విధుల నుంచి తొలగించామని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

32 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న తనను కాదని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు తన భర్త శర్మను ఆమె నిలదీయడంతో ఆమెపై చేయిచేసుకున్నట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. తన తండ్రిపై పోలీసు కేసు నమోడు చేయాలని కోరుతూ పురుషోత్తమ్ శర్మ కుమారుడు, ఆదాయం పన్ను శాఖలో డిప్యుటీ కమిషనర్‌గా పనిచేస్తున్న పర్థ్ రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాకు తన తల్లిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పంపించారు. కాగా..తాను తప్పు చేసినట్లయితే తనతో తన భార్య ఈ 32 ఏళ్లు ఎలా కాపురం చేసిందో తన కుమారుడు చెప్పాలని పురుషోత్తమ్ శర్మ మీడియా వద్ద వ్యాఖ్యానించారు. తన వద్ద డబ్బు తీసుకుని గత 12-15 ఏళ్లుగా తన భార్య విదేశీ యాత్రలకు ఎందుకు వెళుతోందో తన కుమారుడు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. జీవితంలో అన్ని సుఖాలు అనుభవించి తన భార్యకు కుటుంబ పరువును కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News