Thursday, April 25, 2024

సర్వం కోల్పోతున్న పిల్లలు

- Advertisement -
- Advertisement -

supreme-court

 

న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణ బాధ్యతపై తల్లిదండ్రుల మధ్య తలెత్తిన వివాదాల కేసుల్లో పిల్లలు ఎల్లప్పుడూ సర్వం కోల్పోయేవారేనని, వారు ఎలాంటి తప్పు చేయకున్నా తల్లిదండ్రుల ప్రేమ, అభిమానాలకు దూరమై పోతున్నారని దీనికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తోందని సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయం వెలిబుచ్చింది. తల్లిదండ్రులు వివాహసంబంధమైన వివాదంలో సుదీర్ఘకాలంగా ఇరుక్కున్న కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తన అధ్యయనంలో ఈ మేరకు అభిప్రాయం వెలిబుచ్చింది. జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ అజయ్ రస్తోగి తమ తీర్పులో ఈ విషయాలను అధ్యయనం చేశారు.

ఈ సందర్భంగా పిల్లల హక్కులను కూడా పరిగణన లోకి తీసుకుని వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని సూచించింది. వివాహ బంధం విచ్ఛిన్నం కాగానే పిల్లలపై తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయినట్టు కాదని స్పష్టం చేసింది. పిల్లల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంరక్షణ బాధ్యత అంశాన్ని కోర్టులు నిర్ణయించాలని, మధ్యవర్తిత్వం ద్వారా వివాహసంబంధ వివాదం పరిష్కారం అయ్యేలా చూడాలని అప్పటికీ పరిష్కారం కాకుంటే కోర్టులు జోక్యం చేసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.

ఈ సంరక్షణ పోరులో ఎవరు గెలిచారన్నది కాకుండా పిల్లలే ఎప్పుడూ సర్వం నష్టపోతుంటారని, వివాదం పరిష్కరించినప్పుడు తల్లిదండ్రులు ఎవరికి వా రు విడిపోతున్నప్పుడు పిల్లలను సంరక్షించడానికి ఎవరు అర్హులో వారికే కోర్టులు పిల్లల బాధ్య త అప్పచెప్పాలని సుప్రీం సూచించింది. సంరక్షణ అం శంపై నిర్ణయించినప్పుడు ప్రాథమిక, ప్రధాన అంశాలను పరిగణన లోకి తీసుకున్నప్పుడే సంరక్షణ చేకూరుతుందని స్పష్టీకరించిం ది. పిల్లల సంరక్షణే ప్రధానమైనప్పుడు సాంకేతిక అభ్యంతరాలేవీ అడ్డురావని పేర్కొం ది. అలాగే సంరక్షణ అంశం నిర్ణయించినప్పుడు భార్యాభర్తల్లో ఒక్క భార్యనే పరిగణన లోకి తీసుకోకూడదని, పిల్లల ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఆలోచించాలని పేర్కొంది. ఈ కేసును విచారించినప్పుడు ఢిల్లీ హైకోర్టు ఇదివరకు పిల్లల ప్రయోజనాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల వివాదాన్ని పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాన్ని ప్రస్తావించింది. తల్లిదండ్రులు విడాకులనే కోరుకుంటే పిల్లలే నష్టపోతారని సుప్రీం కోర్టు పేర్కొంది.

ప్రస్తుతం విచారణలో ఉన్న కేసు గురించి సుప్రీం వివరిస్తూ తల్లిదండ్రుల వివాదాలను పరిష్కరించడానికే సుప్రీం కోర్టు ప్రయత్నిస్తోందని, కానీ తల్లిదండ్రుల అహం బయటకు వచ్చి పిల్లల బాధలన్నవి మరుగున పడ్డాయని పేర్కొంది. 2017 సెప్టెంబరు ఉత్తర్వు ద్వారా మధ్యంతర ఏర్పాట్లు చేయడమైందని, తల్లిదండ్రుల్లో ఒక్కొక్కరి వద్ద ఇద్దరు పిల్లలు దసరా, దీపావళి, శీతాకాల శెలవులు, ఎలా గడుపుతున్నారో నిర్ణయించడమైందని, ఆమేరకు తరువాత ఉత్తర్వులు వెలువడతాయని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులో భర్త విడాకులు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 21 నాటికి దీనిపై తీర్పు వెలువడుతుంది.

Disputes between parents are the curse to child
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News