Wednesday, November 30, 2022

50 శాతం వయోజనులకు వ్యాక్సినేషన్ పూర్తి

- Advertisement -

Distributed over 127.66 cr of vaccines across the country

 

ఒక్క రోజే కోటికి పైగా డోసులు పంపిణీ
దేశవ్యాప్తంగా 127 కోట్లకు పైగా టీకాలు పంపిణీ

న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం యజ్ఞంలా సాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నాటికి మొత్తం 127.66 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్క రోజే కోటికి పైగా డోసులు ఇచ్చినట్లు తెలిపింది. ఒక్క రోజులో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ఇది ఆరోసారి అని పేర్కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 47.59కోట్ల మంది రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. దేశంలోని వయోజన జనాభాలో 50 శాతం మందికి పైగా రెండు డోసులు తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ‘అర్హత కల వారిలో 50 శాతానికి పైగా వయోజనులు రెండు డోసులు తీసుకోవడం గొప్ప విషయం. మరో మైలురాయిని చేరుకున్నందుకు భారత దేవానికి అభినందనలు. కరోనా మహమ్మారిపై పోరులో మనమంతా కలిసే విజయం సాధిద్దాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.

Distributed over 127 cr of vaccines across the country

Related Articles

- Advertisement -

Latest Articles