Friday, March 29, 2024

రాష్ట్రాలకు కొవాగ్జిన్ పంపిణీ

- Advertisement -
- Advertisement -

Distribution of covaxin to states

జాబితాల్లో తెలంగాణ సహా 14 రాష్ట్రాలు
భారత్ బయోటెక్ వెల్లడి

న్యూఢిల్లీ : ప్రముఖ కరోనా వ్యాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవాగ్జిన్ టీకాలను నేరుగా రాష్ట్రాలకు పంపిణీకి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే కోవాగ్జిన్ టీకాలను 14 రాష్ట్రాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టామని భారత్ బయోటెక్ కంపెనీ కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర ఎల్ల ట్విటర్‌లో తెలిపారు. అంతేకాకుండా టీకాలను సరఫరా కోసం సంప్రదించిన ఇతర రాష్ట్రాలకు కూడా టీకాల లభ్యతను బట్టి సరఫరా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను సరఫరా చేస్తోన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఢిల్లీ, గుజరాత్, జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. భారత్ బయోటెక్ కంపెనీ తొలుత కొవాగ్జిన్ టీకాలను రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధరను రూ. 600గా నిర్ణయించింది. తరువాత నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఒక్కొ డోసు ధర రూ. 400గా నిర్ణయించారు. కొవాగ్జిన్ టీకాలను ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కొ డోసును రూ.1200 అందించనున్నారు. టీకాలను ఎగుమతి చేసుకునే దేశాలకు సుమారు 15-20 డాలర్లకు అందించనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News