Home తాజా వార్తలు ఈ నెల 16 న రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ: మంత్రి తలసాని

ఈ నెల 16 న రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ: మంత్రి తలసాని

Distribution of fish

 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి చేప పిల్లల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అన్ని జిల్లాల్లోను ఈ నెల 16 న చేప పిల్లలను విడుదల చేయాలని అధికారులకు లేఖలు పంపిన మంత్రి తలసాని. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో చేప పిల్లలను విడుదల చేయనున్న మంత్రి తలసాని. రాష్ట్రం లో ఉన్న 24 వేల నీటి వనరులలో 80 కోట్ల చేప పిల్లలు, 5 కోట్ల రొయ్య పిల్లలను కూడా విడుదల చేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కోటి చేప పిల్లలు, 26 లక్షల రొయ్య పిల్లలు విడుదల చేస్తామని అన్నారు. ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు.

Distribution of fish across state on 16th of this month