Home తాజా వార్తలు 9 రోజుల్లో బ్యాంక్ రుణాలు రూ.81781 కోట్లు

9 రోజుల్లో బ్యాంక్ రుణాలు రూ.81781 కోట్లు

Loans

 

ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి

అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు జరిగిన రుణ మేళాలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.81,781 కోట్ల రుణాలను పంపిణీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. వీటిలో రూ.34,342 కోట్ల కొత్త రుణాలు ఉన్నాయని ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. బ్యాంకుల్లో తగినంత నగదు అందుబాటులో ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఇ) బకాయిలు చెల్లించడం కొనసాగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఎంఎస్‌ఎంఇ రంగానికి రూ.40 వేల కోట్లు బకాయి
చిన్న పరిశ్రమలకు నగదు లభ్యత ఉండేలా ఎంఎస్‌ఎంఇలకు బిల్ డిస్కౌంట్ సదుపాయం కల్పించాలని బ్యాంకులను కోరినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పెద్ద కంపెనీల రిటర్న్ ఫైలింగ్ ప్రకారం, వారు ఎంఎస్‌ఎంఇ రంగానికి 40 వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. దీపావళికి ముందు ఎంఎస్‌ఎంఇ చెల్లించేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీతారామన్ అన్నారు.

Distribution of Loans of Public Sector Banks