Home వికారాబాద్ జిల్లాలో రూ. 564 కోట్లతో కుర్మయాదవులకు గొర్రెల పంపిణీ

జిల్లాలో రూ. 564 కోట్లతో కుర్మయాదవులకు గొర్రెల పంపిణీ

GOAT

* వేల మహిళా సంఘాలకు రూ.135 కోట్ల రుణాలు
రాష్ట్ర రవాణా శాఖ మహేందర్‌రెడ్డి

మన తెలంగాణ/తాండూరు రూరల్ ః జిల్లాలో రూ,564 కోట్లతో కుర్మయాదవ్‌లకు గొర్రెలను పంపిణీ చేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సుమారు రూ.5 కోట్ల అభివృద్ధ్ది పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలోని చెంగోల్,సంగెం కలాన్,గౌతాపూర్ గ్రామాలలో కుర్మ యాదవ్‌లకు గొర్రెలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఆర్థికంగా వెనక బడ్డ కుర్మయాదవ్‌లను అదుకోవడానికి తెలంగాణ ప్ర భుత్వం సబ్సిడిపైన గొర్రెలను పంపిణీ చేశారు. జిల్లాలో రూ.564 కోట్లతో గొర్రెలను సబ్సిడిపై పంపిణీ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా కుర్మగొల్లకు ఆర్థికంగా ఎదుకుతారని అన్నారు, అదే విధఁగా జిల్లాలో 4 వేల మహిళా సంఘాలకు రూ.135 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. దీని ద్వారా మహిళలు సాధికర సాధిస్తారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటి సారి 24 గంటల విధ్యుత్ అందిస్తుందని అన్నారు. అదే విధంగా రైతులను ఆదుకోవడానికి ఎకరాకు రూ.4 వేల అందిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల మే నుండి అందిస్తామని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలలో రూ.5 కోట్ల రూపాయలతో సిసిరోడ్లు, మురుగు కాలువలు,అంగన్ సెంటర్‌లు, డ్వాక్రా భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం చేవడుతున్నామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా మార్చ్ 15 వరకు ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రవిగౌడ్, ఎంపిపి కోస్గి లక్ష్మమ్మ, వైస్ ఎంపిపి శేఖర్, మార్కెట్ కమీ టీ చైర్మన్ మాధవరెడ్డి,ఎంపిడిఓ జగన్‌మోహ న్ రావు, ఎల్మేకన్నె పిఎసిఎస్ చైర్మన్ నారాయ ణ గౌడ్, పంచాయత్ రాజ్ ఇఇ మనోహార్, టి ఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాందాస్, రైతు సమన్వయ కన్వినర్ రాంలింగారెడ్డి, నాయకులు రాజప్ప గౌడ్, రాజుపటేల్, సర్పంచ్‌లు, పాపమ్మ, మంజుల వెంకటేష్, సరేందర్‌రెడ్డి, విజయలక్ష్మి పండరి, లాలమ్మ, రత్నాకర్, ఎంపిటిసిలు నాగప్ప,అనితా సాయిలు, డిఇలు నీరజా, వెంకటేశ్వర్లు,పశుసంవర్థక శాఖ అధికారి హేమలత, వ్యవసాయ అధికారి రజిత ఎఇలు నిఖిష్, మహిపాల్ అధికారులు పాల్గొన్నారు.