Home తాజా వార్తలు నిలిచిపోయిన స్మార్ట్ కార్డుల పంపిణీ

నిలిచిపోయిన స్మార్ట్ కార్డుల పంపిణీ

Distribution of Smart Cards Stalled in Telangana

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష స్మార్ట్ కార్డుల పంపిణీ నిలిచిపోయింది. గత కొద్ది కాలంగా ఇదే సమ స్య వెంటాడుతోంది. గ్రేటర్‌లో ఖైరతాబాద్‌తో పాటు, సికింద్రాబాద్, అత్తాపూర్, ఉప్పల్, మేడ్చెల్, నాగోల్, కొండాపూర్, ఇబ్రహీంపట్నం మెహదీపట్నం, బండ్లగూడ, మలక్‌పేట, కూకట్‌పల్లి, ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో 30 నుంచి 40 వేల వరకు స్మార్ట్ కార్డులు ముద్రణ నిలిచిపోయింది. రవాణాశాఖలో పేరుకున్న నిర్లక్ష్యానికి ఇదే ఉదాహరణ. ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెబుతున్నా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది.

గ్రేటర్ వ్యాప్తంగా నిత్యం కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ల సంఖ్య 1000 నుంచి 1500 వరకు జరుగుతూనే ఉంటాయి. మరో రెండు వెల వరకు నూతన లైసెన్స్‌ల జారీ స్తుంటారు. ఇందుకు ఆర్సి, శాశ్వత లైసెన్స్ ధృవపత్రాలను స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేస్తుంటా రు. వీటిలో పాలీనైల్ కార్బన్ చిప్ (పీవీసీ) ఉంటుంది.ఈ కార్డుల ముద్రణ బాధ్యత ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కార్డులను ప్రింట్ చేసేందుకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ సంస్థ తో ఒప్పందం ముగిసిన వెంటనే సదరు సంస్థతో కాంట్రాక్టును పొడగించడం లేదా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడం జరగాలి కాని అలా జరగక పోవడంతో కార్డుల తయారీ, ముద్రణ నిలిచిపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి వాహనం రిజిస్ట్రేషన్,లైసెన్స్‌లు తీసుకున్న 3 నుంచి 4 రోజలుకు సదరు వాహన దారుల కు ఇంటికే రిజస్టర్ పోస్టులో యా స్మార్ట్ కార్డులను పంపిస్తారు.

అందుకు విరుద్దంగా 10 నుంచి 20 రోజులు గడిచినా అవి రాక పోవడంతో వాహన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్మార్టు కార్డుల కొరత ఉన్న సంగతి చాలామంది వాహన దారులకు తెలియక తమ కార్డు ఎటో పోయిందోని కార్యాలయాలకు వచ్చి ఆరా తీస్తున్నా రు. ఈ అంశం పై కొందరు వాహన దారులు డైరక్టుగా సంబంధించిన కార్యాలయాలకు వెళ్ళి అక్కడి అధికారులతో వాగ్వాదాలకు కూడా దిగుతున్నారు. ప్రతి కార్యాలయంలో ఎక్కడో ఒక చోట ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాని అధికారులు ఇందుకు సంబంధించిన సమాచారం సరిగ్గా ఇవ్వకుండా ఒకరి మీద ఒకు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు.

సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంతో అధికారులు సమాచారం ఇవ్వడం లేదని వాహన దారులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ అంశంపై అధికారులు అడగ్గా స్మార్ట్ కార్డుల కొరత ఉన్న మాట వాస్తవమే అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాల్లో పరిస్థితి ఉందంటున్నారు. స్మార్ట్ కార్డుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద మొత్తంలో ఆర్డర్ పెట్టామని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు.ఎం వ్యాలెట్‌ను యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో లెసెన్స్,వాహనంకు సంబంధించిన ఆర్సి ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో ఉంటాయని, పోలీసులు తనిఖీ సమయంలో వాటిని చూపితే సరిపోతుందన్నారు.