Home తాజా వార్తలు మెదక్ జిల్లా కేంద్రంలో నకిలీ నోట్ల కలకలం

మెదక్ జిల్లా కేంద్రంలో నకిలీ నోట్ల కలకలం

district center fraudulent caught fake notes locals

మెదక్ : జిల్లా ప్రజలు నకిలీ నోట్లతో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పి చందన దీప్తి అన్నారు. గత సోమవారం 2000 వేల రూపాయల నకిలీ నోట్లను చలామని చేసిన ఇద్దరు వ్యక్తులను స్థానికులు పట్టుకొని స్టేషన్‌లో అప్పజేప్పడం సంచనలం రేపింది. ఈ ఘటనలో సహసం చేసి నింధితులను పట్టించిన స్థానికులను ఎస్పి అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాలో నకిలీ నోట్ల చలామని చేస్తున్న వారిని కూపిలాగగా పెద్దబండారమే బయటపడింది. ఈ విషయమై ఎస్పి వివరిస్తూ… జిల్లా కేంద్రంలోని సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎరుపు రంగు వ్యాగనార్ కారులో వచ్చి మార్కెట్‌లో చికెన్ తీసుకొని అనంతరం స్థానిక పెద్ద బజార్‌లోని కొండ రమేష్ కిరాణ షాపులో సరుకులు కొని రెండు వేల రూపాయల నోటు నిచ్చి మిగతా డబ్బు తీసుకొని వెళ్లగా అంతలోనే షాపు యజమాని రమేష్ తనకిచ్చిన నోటు నకిలీదని గమనించి అతని తమ్ముడు శ్రీనుతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వెతుకుతూ స్థానిక రాందాస్ చౌరస్థా వరకు రాగా ఓల్డ్ బస్టాండ్ వైపు నుండి ఎరుపు రంగు వ్యాగనార్ కారులో వస్తున్న నింధితులను గమనించి వారిని అనుసరించి ఓల్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసు ముందు కారును ఆపి నకిలీ నోట్ ఇచ్చావని అడడగా అంతలోనే నింధితులు తమ కారు వేగం పెంచడంతో సదరు బాధితుడు కిందపడిపోగా అతని తమ్ముడు, స్నేహితులు కారును పాలో చేసి హౌసింగ్‌బోర్డు సబ్‌స్టేషన్ వద్ద కారును అడ్డుకొని వారిని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించడం జరిగిందన్నారు. రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా మంగళవారం నేరస్తులు తెలిపిన వివరాల ప్రకారం… నింధితుల వద్ద నుండి 7 రెండు వేల రూపాయల నోట్లు, 8 ఐదు వందల రూపాయల నకిలీ నోట్లను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులు నకిలీ నోట్లు వీరి వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో ధర్యాప్తు చేయగా నింధితులలో ఒకరైన మహమ్మద్ షఫీ తల్లిదండ్రులు కూడా గతంలో నకిలీ నోట్ల కేసులో వరంగల్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించి గత ఏప్రిల్‌లో విడుదలైన విషయం తెలియగా వెంటనే నింధితుని స్వస్థలమైన హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధిలో గల ఎర్రగట్టుగుట్టకు చెందిన వారిగా గుర్తించారు. వెంటనే అతని నివాసానికి పోలీసులు చేరుకోని ఇంట్లో నోట్ల తయారీకి ఉపయోగించిన ప్రింటర్, స్కానర్, పేపర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మరో నింధుతుడైన అబ్దుల్ మజీద్ కూడా వీరికి దగ్గరి బంధువేనని తెలిసిందన్నారు. వీరు పోలీసుల కళ్లు కప్పి ఎపి 29బియం 8409 నెంబర్ గల వ్యాగనార్ కారు యొక్క నెంబర్ ప్లేటు మార్చి ఎపి29 బియం 3222 అనే నెంబర్‌ని వేసుకోని దర్జాగా తిరుగుతున్నట్టు తెలిపారు. వీరిని మంగళవారం రాత్రి 8.30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పి తెలిజేశారు. 24 గంటల్లోనే కేసులో పురోగతి సాధించిన డిఎస్పి వెంకటేశ్వర్లు, సిఐ శ్రీరాంవిజయ్, ఎస్ఐలు శేఖర్‌రెడ్డి, లింబాద్రి, శ్రీకాంత్‌లతో పాటు సిబ్బందిని ఎస్పి అభినందిచారు.