గద్వాల న్యూటౌన్ : పార్లమెంట్ ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం పకడ్బందిగా ప్రణాళికకలు రూపొదించాలని జిల్లా ఎన్నికల అధికారి శశాంక సూచించారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి 66సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని ఆయన తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలిస్‌శాఖ అధికారులను అదేశించారు. మంగళవారం తన ఛాంబర్లో జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్తో కలిసి ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి ఒక కానిస్టేబుల్ లేదా హోమ్‌గార్డును కెటాయించాలని చెప్పారు. ఓటర్లను వరుస క్రమంలో నిలబెట్టెందుకు పోలీస్ సిబ్బందితో పాటు స్ధానికంగా పని చేసే విఆర్ఎ లేదా నాల్గోవ తరగతి ఉద్యోగిని ఉంచేందుకు ప్రణాళికలు చేయాలన్నారు. మొబైల్ బృందం రూట్ల వారిగా గస్తీ తిరుగుతూ ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినా క్షణాల్లో మొబైల్ బృందం అక్కడికి చేరుకునేలా రూట్లు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. జిల్లాలో అక్రమ మద్యాన్ని అరికట్టాడానికి అన్ని బెల్టు షాపులను తక్షణమే మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో ఉన్న వైన్‌షాపుల్లో సిసి కెమెరాలు పని చేస్తున్నాయో లేదా అనే విషయాలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
జిల్లాకు ప్రత్యేక పోలీస్ బలగాలు : ఎస్పీ లక్ష్మీనాయక్
జిల్లాకు పార్లమెంటు ఎన్నికల కెటాయించిన సిఐఎస్ ఎఫ్ పోలీస్ బలగాలతో పాటు మరికొన్ని ప్రత్యేక పోలీస్ బలగాలు రానున్నాయని జిల్లా ఎస్పీ లక్ష్మీనాయక్ అన్నారు. జిల్లాలో సమస్యలు లేకుండా పకడ్బందిగా బలగాలు కేటాయించమని తెలిపారు. ఎక్కడ సమస్య ఉత్పన్నమైన క్షణాల్లోనే అక్కడికి పోలీస్ బృందం చేరుకునే విధంగా రూట్లు తయారు చేశామని చెప్పారు. ప్రతి బృందానికి ఒక ఎస్సై స్ధాయి అధికారి కెటాయించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో జేసి నిరంజన్, అడిషనల్ ఎస్పీ కృష్ణ, ఆర్డీఓ రాములు, డిఎస్పీ షాకీర్ హుస్సేన్, భరత్, ఎలక్షన్ సిఐ పి జి రెడ్డి, అబ్కారీ శాఖ సిఐ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.