Home తాజా వార్తలు డెంగ్యూ బాధితులకు పెద్దాసుపత్రే సేఫ్

డెంగ్యూ బాధితులకు పెద్దాసుపత్రే సేఫ్

District Hospital

 

డెంగ్యూ బాధితులకు అండగా ఉమ్మడి జిల్లా ఆసుపత్రి
24 గంటలు అందుబాటులో వైద్యులు, సిబ్బంది
డెంగ్యూ చికిత్సకు అధునాతన పరికరాలు
డెంగ్యూ పీడితులకు ప్లేట్‌లెట్స్ ఎక్కించే రూ. 40 లక్షల విలువైన ఎస్‌డిపి యంత్రం
రక్తదాతల నుంచి బాధితులకు తెల్లరక్త కణాలు ఎక్కించే పరికరం ఎస్‌డిపి
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా అధునాతన రక్తపరీక్షల పరికరాలు
ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపోహలు పక్కన పెట్టాలంటున్న వైద్యులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెద్దాసుపత్రి డెంగ్యూ పీడిత బాధితులకు భరోసాగా నిలుస్తుంది. జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ జ్వరం బారిన పడిన పీడితుల కోసం పిల్లలకు, పెద్దలకు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి 24 గంటలు నిష్ణాతులైన వైద్యులను అందుబాటులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. డెంగ్యూ బాధితులలో తెల్లరక్త కణాలు పదివేలకు పడిపోయిన భయపడాల్సిన అవసరం లేదని అక్కడి వైద్యులు బాధితులకు అభయహస్తం అందిస్తున్నారు. ప్లేట్‌లెట్స్ కౌంటింగ్ కోసం అధునాతనమైన రక్త పరీక్షల యంత్రాలతో పాటు రూ. 40 లక్షల విలువైన సింగిల్ డోనర్ ప్లేట్‌లేట్ సపరేట్ మిషన్ (ఎస్‌డిపి)ని పెద్దాసుపత్రిలో అందుబాటులో ఉంచడం ద్వారా సుమారు 250 మందికి ఈ యంత్రం ద్వారా తెల్లరక్తకణాలను ఎక్కించి ఇక్కడి వైద్యులు
ప్రాణదాతలుగా నిలిచారని చెప్పవచ్చు.

ప్రైవేట్ ఆసుపత్రులు సాధారణ జ్వరాలతో వెళ్ళిన వారిని సైతం డెంగ్యూ జ్వరం అని భయపెట్టించడం ద్వారా ప్రజలు విధి లేని పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులలో చేరి జేబులు గుల్ల చేసుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపోహ కారణమే ప్రైవేట్ ఆసుపత్రులకు వరంగా మారుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న అధునాతన పద్ధతి చికిత్సలకు ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పేద, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ డెంగ్యూపాసిటివ్ అని తేలితే ప్రైవేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు చూ పి డబ్బులు వృథా చేసుకుంటున్నారనే ఆవేదనను పలువరు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లోని పెద్దాసుపత్రిలో డెంగ్యూ కోసం జరుగుతున్న చికిత్సలపై ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడిప్పుడే జిల్లా ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

నాగర్‌కర్నూల్  : 15 రోజులలో 960 మందికి డెంగ్యూ పరీక్షలు మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రులో 15 రోజులలో 1500 మంది ఔట్ పేషంట్లు జ్వరాలతో నమోదు కాగా వారిలో 960 మందికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 161 మందికి డెంగ్యూ పాసిటివ్‌గా నమోదయ్యారు. ఇదిలా ఉండగా గత 4 రోజులుగా మరో 53 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రిలో ప్లేట్‌లెట్‌కి సంబంధించిన అధునాతనమైన యంత్రాలతో అవసరమైన వారికి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూసన్స్ జరుపుతున్నారు.15 రో జులలో 8 మంది సీజనల్‌వ్యాధుల దృష్టా 8 మంది ప్రాణాప్రాయ స్థితిలో ఉండగా ఐసియు లో ఉంచి చికిత్సలు అందించి జిల్లా వైద్యులు ప్రాణదాతలుగా నిలిచారు.

ప్రతి రోజు రెండు విడతల్లో ఓపి సేవలు
జిల్లా ఆసుపత్రులో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రెండు గంటల వరకు సా యం త్రం 4 గంటల నుండి ఆరు గంటల వరకు ఓపి సేవలు అందుబాటులో ఉంటున్నాయని మహబూబ్‌నగర్ జనరల్ ఆసుపత్రి సూపరిన్‌టెండెంట్ డాక్టర్ రాం కిషన్ తెలిపారు. సిఓటి, ఐసియు, పిఐసియు సేవలు కూడా 24 గంటలు అందుబాటులో ఉంచుతున్నారు. ఆసుప త్రి సూపరిన్‌టెండెంట్‌తో పాటు జనరల్ మెడిసిన్ హెచ్‌ఓడిలు హెడ్‌నర్స్‌లు, సిహెచ్‌ఓలను అందుబాటులో ఉంచి 24 గంటలు విషజ్వరాల పై పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.

40 లక్షలతో ఎస్‌డిపి యంత్రం
ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉమ్మడి జిల్లాలోని జనరల్ ఆసుపత్రిలో ప్రభుత్వం 40 లక్షల రూపాయలు వేచ్చించి ఎస్‌డిపి యంత్రాన్ని ( సింగిల్ డోనర్ ప్లేట్‌లేట్ సపరేటేడ్ మిషిన్ )ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యంత్రం వల్ల ప్లేట్‌లెట్స్ 20వేల లోపు పడిపోతే రక్తదాతల సహాయంతో తెల్లరక్త కణాలను దాత నుంచి వేరు చేసి డెంగ్యూ పీడితులకు శరీరంలో ఎక్కిస్తారు. ఈ యంత్రం ఉమ్మడి జిల్లా మొత్తంలో ప్రభుత్వ ఆసుపత్రులో ఒక పెద్ద ఆసుపత్రులో మాత్రమే అందుబాటులో ఉంది. ప్లేట్‌లెట్స్ శాతం పడిపోయిన భయపడాల్సిన అవసరం లే దని జిల్లా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు. సాధ్యమైనంత వరకు డెం గ్యూ పీడితులకు చికిత్స ద్వారానే నయం అవుతుందని కొందరిలో మాత్రమే ప్లేట్‌లెట్స్ తగ్గి తే ఎక్కించడం జరుగుతుందని ఆయన వివరించారు. డెంగ్యూ జ్వరాలకు సైతం భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.

జిల్లా జనరల్ ఆసుపత్రిల్లో 24 గంటలు వైద్యసేవలు
మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రుల్లో అన్ని రకాల జ్వరాలకు వైద్య సేవలు అందించడానికి 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి మెడికల్ సూపరిటెండెంట్ డాక్టర్ రాంకిషన్ తెలిపారు. ఓపి ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు విడత ల్లో పెడుతున్నామని గత మూడు నెలల్లో 1 లక్ష మంది రోగులు ఔట్‌పేషంట్లుగా 8 వేల మంది ఇన్‌పేషంట్లుగా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు ఆయన తెలిపారు.

గత 15 రో జుల్లో 1500 మందికి ఔట్ పేషంట్లు నమోదు కాగా వీరిలో 161 మందికి డెంగ్యూ పాసిటి వ్ రావడంతో వీరికి అధునాతన చికిత్స అందించి ప్రాణాప్రాయం నుండి కాపాడడం జరిగిందన్నారు. జ్వరాలతో పాటు డెంగ్యూ పాసిటివ్ వచ్చిన భయపడాల్సిన అవసరం లేదని వై ద్యులను సంప్రదించి నిర్లక్షం వహించకపోతే నివారణ సాధ్యమతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు జిల్లా ఆసుపత్రిలో సేవలు సధ్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాంకిషన్ తెలిపారు.

District Hospital support for Dengue sufferers