Home వనపర్తి జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కమిటీ ఎంపిక

జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కమిటీ ఎంపిక

speak– కలెక్టర్ శ్వేతామహంతి
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో అనాథ శరణాలయంతో పాటు వృధ్దాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్వేతామ హంతి అన్నారు. సోమవారం తన చాంబర్‌లో తనను కలిసిన ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కమిటి సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ నూతన కమిటి ముందు గా అనాథ శరణాలయం, వృద్దాశ్రమం, సీరియర్ సిటిజన్స్ హోం ఏర్పాటుకు కృషి చేయాలని ఇందుకు అవసరమైతే తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటైన జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి సభ్యు లు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ ద్వారా చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్ వారితో చర్చిస్తు పై విషయాలను చెప్పారు. వనపర్తి జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటి రెగ్యులర్ కమిటి చైర్మన్ ఖాజాకుతుబుద్దిన్, వై స్ చైర్మన్‌గా ఎం.డిఅమర్, ప్రధానకార్యదర్శిగా పోచ రవీందర్ రెడ్డి, కోశాధికారి భగవంత్‌రెడ్డి, ఎంసి. సభ్యులుగా డా. ఎల్ .మురళీధర్, డా. రమేష్‌బాబు, చిన్న మ్మథామస్, కలాంపాషా, రాఘవేందర్ రెడ్డి, జెఎం మిషేక్‌లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అంతే గాక రెడ్‌క్రాస్ సూత్రాలను పాటించాలని కలెక్టర్ శ్వేతా మహంతితెలిపారు.