Home కామారెడ్డి రైతు అప్పు లేకుండా వ్యవసాయం చేసే స్థాయికి ఎదిగేందుకు కృషి

రైతు అప్పు లేకుండా వ్యవసాయం చేసే స్థాయికి ఎదిగేందుకు కృషి

pocharam

కామారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో రైతులు అప్పులు లేకుండా వ్యవసాయం చేసేలా ఎదగాలని వ్యవసాయ శాఖ మంత్రిపోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి పంటల సాగుపై జిల్లా స్థాయి అవగాహన సదస్సులు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 36 లక్షల మంది రైతులకు 17వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదట సంతకం రుణమాఫీపై చేసిందన్నారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకున్న కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్,  రాష్ట్రాలు రైతు రుణమాఫీ చేస్తున్నప్పటికి కేవలం సహకార సం ఘాల్లో మాత్రమే రుణమాఫీ చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అన్ని రకాల బ్యాంకుల్లో లక్షలోపు రుణాలు మాఫీ చేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హైద్రాబాద్ మినహా 31 జిల్లాలో 559 మండలాల్లో 10,773 రెవెన్యూ గ్రా మాల్లో రైతు సమన్వయ కమిటీలను లక్ష 62వేల మంది సభ్యులను జీవో నెంబర్ 39తో నియమించడం జరిగిందన్నారు. ప్రతి పక్షాలు రైతు సమన్వయ కమిటీలను టిఆర్‌ఎస్ కమిటీలుగా విమర్శిస్తున్నాయని , కాని రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకే  వ్యవసాయం పట్ల అవగాహన కలిగిన వ్యక్తి గ్రామంలో స్థానికంగా ఉండే పట్టాపాసు పుస్తకం ఉన్న వారిని మాత్రమే నియమించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో ఆదర్శ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో  వచ్చిన సంక్షేమ పథకాలను ఆదర్శ రైతులు స్వాహా చేశారన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధం గా తెలంగాణ రాష్ట్రం రైతులకోసం సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. స్వాతం త్య్రం సిద్దించినప్పటి నుండిరైతుకు వారసత్వ సంపదగా అప్పును ఇస్తున్న ప్రభుత్వాలని , కాని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేసేందుకే కంకణం కట్టుకుందన్నా రు. తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుతం అన్నారు. రైతు అప్పు లేకుండా గర్వంగా తలెత్తుకుని బ్రతికేలా కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫితో పాటు పంటకు 4వేల చొప్పున రెండు పంటలకు 8వేల రూపాయలు ,యంత్ర లక్ష్మీ ద్వారా సబ్సీడి యంత్రాలను అందజేస్తుందన్నారు. దేశ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దేవిలాల్, ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేశారని అందులో ఓవర్ డ్యూ రుణా న్నే మాఫీ చేయడంతో నిజాయితీ గల రైతులకు అన్యాయం జరిగిందన్నారు. కాని కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయంగా లక్షలోపు రుణాన్ని మాఫి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1కోటి 20 లక్షల  ఎకరాల్లో పంటను   యాసంగిలో సాగు చేసేందుకు 2638 మంది ఏఈవోలు పనిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 2050 భూ సార పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. రైతుకు నష్టం జరిగితే ఏ ప్రభుత్వం నష్ట పరిహారం అందించలేదని కాని టిఆర్‌ఎస్ ప్రభుత్వం 11లక్షల 60వేల 961 మంది రైతులు తమ పంట ఇన్సురెన్స్ చేయించుకోగా 747కోట్ల 39లక్షల రూపాయలను ఇన్సురెన్స్ కంపెనీల ద్వారా చెల్లించడం జరిగిందన్నారు. రైతుకు పెట్టుబడి తగ్గించేందుకు వ్యవసాయాన్ని యంత్రీకరణవైపు మల్లించేందుకు యంత్ర లక్ష్మి ద్వారా యంత్రాలను అందిస్తున్నామన్నారు. రాష్ట్ర  రైతు సంఘంకు బడ్జెట్‌లో 500 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందన్నారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ కొరకు 94 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. మల్లన్న సాగర్ ద్వారా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు అదనంగా 2లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా పంప్ హౌజ్‌ల ద్వారా చెరువులు నింపి సాగు చేసేందుకు సంబధిత శాఖ ఆధ్వర్యంలో అనుమతులు లభించాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చెరుకు పంటకు పెట్టింది పేరుగా ఉన్న కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కెసిఆర్ చెరుకు, ఉద్యానవన పంటలకు దీర్ఘకాలిక పంటలుగా గుర్తించి 8వేల అందించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రతి ఏఈవో క్లస్టర్‌లో 15 లక్షల రూపాయల నిధులతో రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు పంటలను దళారులకు  విక్రయించదని, కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించేలా రైతు సమన్వయ కమిటీలు పనిచేయాల్సిన భాద్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, కామారెడ్డి ఏడిఏ మహేశ్వరి, ఏవోలు పవన్ కుమార్, శ్రీనివాస్ రావ్, రైతు కమిటి అధ్యక్షులు నర్సారెడ్డి, మోహన్‌రెడ్డి ,లకా్ష్మరెడ్డి ,నందరమేష్, ఇంద్రసేనారెడ్డి, వంగ లలిత, రైతు కమిటిసభ్యులు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.