Home తాజా వార్తలు 23 జిల్లాలకు సోకిన కరోనా మహమ్మారి…

23 జిల్లాలకు సోకిన కరోనా మహమ్మారి…

telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 272 చేరింది. వైరస్ నుంచి కోలుకుని 33మంది డిశ్చార్జ్ కాగా, 11మంది మృతిచెందారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 228మంది చికిత్సపొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ తెలంగాణలోని 23జిల్లాలకు విస్తరించినట్టు సమాచారం. హైదరాబాద్ 93, వరంగల్ అర్భన్ 21, నిజామాబాద్ 18, నల్గొండ 13, మేడ్చల్ 12, రంగారెడ్డి 10, కామారెడ్డి 10, ఆదిలాబాద్ 9, సంగారెడ్డి 6, కరీంనగర్ లో 6, గద్వాల 5, మెదక్ 5, కొత్తగూడెం3, జగిత్యాల 2, జనగామ 2, మహబూబ్ నగర్ 3, నాగర్ కర్నూలు 2, వికారాబాద్ 2, భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యపేట, వరంగల్ రూరల్ లో ఒక్కోకేసు నమోదైందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరీంగనర్ లో నిన్న కరోనా కేసులు నమోదు కాలేదు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఏడుగురి రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. ఇండోనేషియా వాసులతో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. ఆ వ్యక్తి గతంలో కరోనా పాజిటివ్ రాగా గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 12రోజుల తర్వాత బాధితుడికి వైద్య పరీక్షల్లో నెగిటివ్ గా వచ్చింది. దీంతో మరో 14 రోజులు హోమ్ ఐసోలేసన్ లో ఉండాలని అధికారులు సూచించారు. అటు ఉమ్మడి కరీంగర్ జిల్లాలో లాక్ డౌన్ పకడ్బందీగా కొనసాగుతుంది. కరోనా వైరస్ (కోవిడ్ -19) నిర్మూలనకు తెలంగాణ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.

District Wise Coronavirus Cases in Telangana