Home జిల్లాలు సుస్తీ జాగ్రత్తలతో స్వస్తి

సుస్తీ జాగ్రత్తలతో స్వస్తి

niz* వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలి
*నిర్లక్షం చేస్తే మలేరియా తీవ్ర రూపం
*ఆసుపత్రుల పాలవుతున్న జనం
*జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు

నిజామాబాద్ నాగారం:జిల్లాలో వ్యాధుల భయం వేటాడుతుంది. ప్రస్తుత వ్యాధుల సీజన్‌లో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని ప్రకటిస్తున్నా… క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మలేరియా జ్వరాలు ఓ వైపు ప్రజలను బెదిరిస్తుంటే .. డయేరియా కబలిస్తోంది. వీటితో పాటు టైఫాయిడ్ వంటి రోగాలు గిరిజన ప్రాంతంలో వీడటం లేదు. ఆయా రోగాల బారినపడకుండా ఉండేందుకు ఆరోగ్య సూత్రాలను పాటించాలని అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వర్షం సంతోషానిస్తుంది. జాగ్రత్త పడకపోతే కుండెడు వ్యాధులను తెస్తుంది. ప్రత్యేకంగా పిల్లలకు వృద్ధులకు వ్యాధలు సోకే అవకాశం ఎక్కువ. అలాగే ఆఫీస్‌లకు వెళ్లి వస్తు వానలో తడిసే వాళ్లకు కూడా జాగ్రత్తలు అవసరం. ఈ సీజన్‌లో వర్షాలు మొదలవగానే ఈగలు కనిపిస్తుంటాయి. ముసురు పట్టగానే మరీ ఎక్కువగా వచ్చేస్తుంటాయి. ఈగలతో దాదాపు నూరు రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇవి సాధారణంగా పరిశుభ్రత లేని పరిసరాలలో ఇవి కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని మైళ్ల దూరం ప్రయాణం చేయగలవు. ఈగ లార్వాతో వృద్ధి చెందే వ్యాధులను మైయాలిస్ అంటారు. సాధారణంగా ఒంటిపై ఉండే గాయాలు పుండ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈగల ద్వారా వృద్ధి అయ్యే వ్యాధులు వ్యాప్తి చెందుతుంటాయి. ఈగ లార్వాలు కొన్ని కంటిలోకి కూడా ప్రవేశించి రెటీనాకు సహితం హాని చేయవచ్చు. ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులలో ప్రధానంగా ఫ్లాస్మోడియమ్ పాల్సిపేరం, ప్లాప్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవలె, ప్లాస్మోడియం మలేరియా, అమిబియాసిస్, జియార్జియాసిస్, వ్యాధులు ప్రధానమైనవి. జిల్లాలో ప్రతీ ఏటా మలేరియా వ్యాధి ద్వారా వందలాది మంది మంచాన బారిన పడుతున్నారు. దోమకాటు బారిన పడి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ రెండోవారం నుంచి వర్షాలు మొదలు కావడంతో దోమలు విపరీతంగా పెరిగాయి. దీంతో వివిధ వ్యాధలు పిల్లలను, పెద్దలను, వృద్ధులను, మహిళలను ఆస్థమ వ్యాధిగ్రస్థులను అనేక రకాల బాధిస్తున్నాయి.
దోమతో వచ్చే వ్యాధులు
మలేరియా: ఆనాఫిలస్ దోమతో వ్యాప్తి చెందే వ్యాధి మలేరియా. ఈ దోమ రాత్రి వేళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దోమలో వృద్ధి చెందే ప్లాస్మోడియం అనే ప్రొటోజోవ రకానికి చెందిన సూక్ష్మజీవి వల్ల మలేరియా వస్తుంది. దీని వల్ల ఒక్కోసారి శ్వాస తీసుకోవడం ఇబ్బంది, స్పృహ తప్పిపోవడం జరుగుతుంది.
చికెన్ గున్యా: ఇది ఎడిస్ ఈజిప్లై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమ సాధారణంగా పగటి వేళ ఎక్కువగా కనిపిస్తోంది. జ్వరంతో పాటు విపరీతమైన తలనొప్పి తీవ్రస్థాయిలో కీళ్ల నొప్పులు ఉంటాయి.
డెంగ్యూ: ఈ వ్యాధికి సైతం ఎడిస్ ఈజిప్లై దోమయే కారణం జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు ఎముకలు విరిచేసినంత నొప్పి వస్తోంది. అందుకే దీనిని బ్రెక్‌బోన్ ఫివర్ అని కూడా అంటారు.
ఎలుకల వల్ల: వర్షాలకు ఎలుకలు బయట నుంచి ఇంట్లోకి రావటం వల్ల లెప్టోస్పోరిసిస్ అనే వ్యాధి వస్తుంది. ఎలుకలు వృద్ధి చేసే ఈ వ్యాధికి అసలు కారణం లెప్టో అనే బ్యాక్టిరియా ఎలుకల వల్ల ఆహారం కలిషితమై పోయి ఈ వ్యాధి వస్తుంది. ఈ సీజన్‌లో నీళ్లల్లో నిత్యం తిరిగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కొన్నిసార్లు వాంతులు కావటం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ప్రధానంగా కనిపిస్తాయి.
నీరు కలుషితం కావటం వల్ల
ఈ సీజన్‌లో నీరు కలుషితం కావటం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు, కాళ్లు కడుక్కోవలెను. పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. టైఫాయిడ్, కలరా, సిజెలోసిస్, ఈ కొలై అనే వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. టైఫాయిడ్ వల్ల జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, కలరా వల్ల నీళ్ల విరేచనాలు, వాంతులు, సిజెలోసిస్ వల్ల జ్వరం, రక్తవిరోచనాలు ఈకొలై వల్ల కిడ్నిలు, ఊపిరితిత్తులు, మెదడు, చర్మం లాంటి భాగాలలో ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.