Home తాజా వార్తలు కోర్టును ఆశ్రయించిన జకోవిచ్

కోర్టును ఆశ్రయించిన జకోవిచ్

Djokovic court appeal against cancellation of his visa adjourned

 

మెల్‌బోర్న్: సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ తనకు జరిగిన అవమానంపై ఆస్ట్రేలియా ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు జకోవిచ్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సోమవారం విచారణ చేపట్టనున్నాడు. ప్రస్తుతం జకోవిచ్ హోటల్ గదికే పరిమితమయ్యాడు. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్‌ను ఆస్ట్రేలియా పోలీసులు విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నాడు. వ్యాక్సినేషన్ తీసుకోక పోవడానికి గల కారణాలు సరిగ్గా లేవని ఆస్ట్రేలియా పోలీసులు జకోవిచ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం జకోవిచ్ వీసాను కూడా రద్దు చేసింది. ప్రపంచంలోని దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న జకోవిచ్‌కు ఆస్ట్రేలియా గడ్డపై ఘోర అవమానం జరిగింది. కాగా, జకోవిచ్‌కు మద్దతుగా ఆస్ట్రేలియాలోని సెర్బియన్లు ప్రదర్శన చేశారు. ఫ్రీ నొవాక్, ఫ్రీ రిఫ్యూజిస్ అంటు వారు నినాదాలు చేశారు.

Djokovic court appeal against cancellation of his visa adjourned