Friday, March 29, 2024

ఆస్ట్రేలియన్ ఓపెన్ జోకోవిచ్ దే..

- Advertisement -
- Advertisement -

Djokovic wins Australian Open

మెల్‌బోర్న్: సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్ తన కెరీర్‌లో తొమ్మిదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ రష్యాకు చెందిన డానిల్ మెద్వెదెవ్( 4వ సీడ్)ను 7-5,6-2,6-2తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గంటా 53 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్‌లో మాత్రమే జొకోవిచ్‌ను కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. అయితే తర్వాత జొకోవిచ్ అద్భుతమైన స్ట్రోక్‌ప్లేతో పదునైన సర్వీస్ షాట్లు ఆడి రెండు సెట్లను గెలుచుకోవడంతో మ్యాచ్ ముగిసింది. ఈ విజయంతో కెరీర్‌లో తొమ్మిదో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను.. మొత్తంగా 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. గత మూడుసార్ల నుంచి వరుసగా ఈ టైటిల్‌ను జకోవిచ్ సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020 వరకు అన్ని టైటిళ్లనూ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌తో తొమ్మిదవసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2021ని టైటిల్‌తో మొదలు పెట్టాడు. ఇక ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల జాబితాలో ఫెదరర్, నాదల్ సరసన చేరాలంటే జకోవిచ్ మరో రెండు టైటిళ్లు గెలిస్తే సరిపోతుంది. ఇప్పటికే ఫెదరర్, నాదల్ చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచి టాప్‌లో ఉన్నారు.

వాన్ డోడిగ్, ఫిలిప్ పోలాసెక్ జోడీకి డబుల్స్ టైటిల్
ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను వాన్ డోడిగ్, ఫిలిప్ పోలాసెక్ జోడీ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఈ జోడీ డిఫెండింగ్ చాంపియన్లు రాజీవ్ రామ్, జో శాలిస్‌బరీ జోడీని 6 3,6 4స్కోరుతో వరస సెట్లలో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. డేనియల్ హన్టుచోవా తర్వాత గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను దక్కించుకున్న రెండో సెర్బియన్ పోలాసెక్ కావడం గమనార్హం. కాగా ఈ ఓటమితో మెల్బోర్ పార్క్‌లో రెండో టైటిల్‌ను దక్కించుకునే అవకాశాన్ని రామ్ చేజార్చుకున్నాడు. శనివారం బర్బరా క్రెజిసికోవాతో కలిసి రామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News