Saturday, March 25, 2023

నేడు అభివృద్ధ్ది పనులను ప్రారంభించనున్న మంత్రి

- Advertisement -

bazar

* రూ.3 కోట్లతో రైతు బజార్
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
* ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలకు భూమి పూజ
* మంత్రికి ఘన స్వాగతానికి ఏర్పాట్లు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట నియోజకవర్గంలో ముఖ్యమైన మూడు అభివృద్ధ్ది పనులను మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించనున్నారు. తె లంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన రైతు బజార్‌ను, రెండు కోట్ల వ్యయంతో నిర్మించి న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని, 13 కోట్ల వ్యయంతో నం గునూరులో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి మంత్రి హరీశ్‌రావు భూమి పూజ చేయనున్నారు.
ఆదర్శంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం : రా ష్ట్రానికే ఆదర్శంగా సిద్దిపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను నిర్మించారు. సిద్దిపేట జిల్లా ఏర్పడక ముందే మంజూరైన మొదటి జిల్లా స్థాయి కార్యాలయం ఇదే కావడం గమనార్హం. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఉ న్న పోలీస్ కంట్రోల్ రూమ్‌ని పొన్నాల వద్ద నిర్మించా రు. జిల్లాలోని 800 సిసి కెమెరాలు, సిద్దిపేట పట్టణం లో సిగ్నలింగ్ వ్యవస్థ, కోమటి చెరువు వద్ద లేక్ పోలీసింగ్, మైక్ అనౌన్స్‌మెంట్‌ను ఇక్కడి నుంచి పర్యవేక్షించవచ్చు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిఐజి శివశంకర్‌రెడ్డి, ఐజి స్టీఫెన్ రవీంద్రలు హాజరవుతున్నారు.
అధునాతన హంగులతో రైతు బజార్ : అధునాతన హంగులతో నిర్మించిన రైతు బజార్‌ను సోమవారం మంత్రి హరీశ్‌రావు ప్రా రంభించనున్నారు. మూడు కోట్ల వ్యయంతో షాపింగ్ మాల్‌ను త లదన్నేలా దీన్ని నిర్మించారు. సిసి కెమెరాల నిఘా, డిజిటల్ ధరల బోర్డు, స్క్రీన్ వీడియో, లిఫ్ట్ సౌకర్యం, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచలన మేర కు కూరగాయల ఫ్లాట్ ఫామ్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేశా రు. మంత్రి హరీశ్‌రావు మేథో పుత్రికగా సిద్దిపేట రైతు బజార్‌ను చెప్పవచ్చు. రైతు బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్‌రావును రైతులు పాత బస్టా ండ్ నుంచి ఊరేగింపుగా తీసుకురానున్నారు. ఈ సం దర్భంగా నిర్వహించే ర్యాలీలో బోనాలు, బతుకమ్మలు, మంగళ హారతులతో మంత్రికి స్వాగతం పలకనున్నారు.
కార్పొరేట్ స్థాయిలో భవన నిర్మాణం : ఎస్సీబాలికల గురుకుల పాఠశాలను కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో నిర్మించనున్నారు. అధునాతన హం గులతో అన్ని సౌకర్యాలతో రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం రూ.13 కోట్లను కేటాయించారు. నంగునూరులో మంత్రి హరీశ్‌రావు సోమవారం దీనికి భూమి పూజ చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News