మనతెలంగాణ/ఇందూరు: పరిశ్రమల అనుమతులను అర్హులైన వారికి అనుమతులు జాప్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్‌లో టియన్‌ఐపాస్, జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల అనుమతులకు డిపార్ట్‌మెంట్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల రెండు పర్యాయాలు టిఎస్‌ఐ పాస్‌పై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. 231 పరిశ్రమలకు 484 అనుమతులకు 417 అనుమతించడం జరిగిందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు 45 తిరస్కరించడం జరిగిందన్నారు. ఎస్‌సి స్కిం క్రింద నాలుగు యూనిట్లకు గాను 11 లక్షల 12వేలు 249, ఎస్‌టి స్కిమ్‌లకు రెండు యూనిట్లాకుగాను రూ.5లక్షల 40వేల 855 మంజూరైనట్లు తెలిపారు. పరిశ్రమలకు డిపార్టుమెంట్ అనుమతు లు వేగం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమ ంలో జీఎం ఇండస్ట్రియల్ శాంతికుమార్, ఎల్‌డిఎం సురేష్‌రెడ్డి, ఆర్‌ఓకేవీఐఎం చొక్క నాయ క్, సంబంధిత కమిటీ సభ్యులు పాల్గొన్నారు.