Home పెద్దపల్లి మాతృభాషను మరవద్దు

మాతృభాషను మరవద్దు

grand

మనతెలంగాణ /పెద్దపల్లి: ప్రతి ఒక్కరు తమ జీవితాల్లో ఉన్నతస్థాయి కి చేరిన మాతృమూర్తిని, మాతృబాషను మరువకూడదని ,మాతృభాషను ప్రేమించి దానిని పరిరక్షించేందుకు కృషి చేయాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ఎస్.ప్రభాకర్ రెడ్డి అన్నారు.మంగళవారం రోజున స్థానిక ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాన్ని ఆయన, పెద్దపల్లి శాసన సభ్యులు దాసని మనోహర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మన భాషను ,సంస్కృతిని ,ఆచారాలను రక్షించుకొని, ముందు తరాల వారికి అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.ఉద్యోగం నిమిత్త ం లేదా వ్యాపార లావాదేవీల నిమిత్త ం ఆగ్లం మరియు వేరే భాషలు నేర్చుకున్నప్పటికి మన తల్లి నేర్పినట్టి తెలుగు భాషను మరువకూడదని,మన ఇండ్లలో మన సొంత భాషలో మాట్లాడాలని, తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహిస్తుందని, వీటిలో కవులను, సాహితీ వేత్తలను సత్కరించుకుంటూ, మన సంస్కృతిని పెంపొందించడానికి ఇలాంటి తెలుగు మహాసభలు ఉపయోగపడుతాయని, జిల్లాలోని కవులు, రచయితలు, భాష ప్రియులు వీటిని ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం ఐడిసి చైర్మన్ ఈద శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా జిల్లా లో ప్రపంచ తెలుగు మహాసభలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారని తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఎన్‌టిఆర్ నిలిచారని , వారి తర్వాత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి కేసిఆర్‌తెలుగు భాష పట్ల అంతటి అభిమానాన్ని చూపుతున్నారని, ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచం తో పాటు పోటీ పడుతున్న తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని , బాష ఉపయోగాన్ని, రచయితలను, సాహిత్యాన్ని పరిరక్షించుకోవడానికి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని, వీటిని కవులు ,రచయితలు,కళాకారులు ఉపయోగించుకోవాలని తెలిపారు.అనంతరం శాసనమండలి సభ్యులు నారాదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పాలనలో మన సంస్కృతి , భాష, చరిత్రను వక్రీకరించారని, ప్రస్తుతం స్వపరిపాలనలో మన ప్రభుత్వం వాటిని చక్కదిద్దేందుకు కృషి చేస్తుందని తెలిపారు.భాష సంపదతో విరజిల్లిన తెలంగాణ లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నారని , వాటికి సన్నాహకంగా ప్రతి జిల్లాలో ముందస్తు సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆంగ్లేయంతో పాటు మాతృ బాషను కూడా నేర్పాలని, మాతృ భాషలో విద్యను అభ్యసిస్తే లోతైన విజ్ఞానం, పరిశోధన శక్తి అలవడుతుందని తెలిపారు.తెలుగు భాషను మరువకూడదని తెలిపారు.అనంతరం పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన కవులు , రచయితలు ఉన్నారని, ప్రపంచ వ్యాప్తంగా మన సంస్కృతి, భాషను, కళను ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురిచేసారని తెలిపారు.వాటిని పునరుద్దరించేందుకు , మన బాషను కవులకు ప్రపంచ వ్యాప్తంగా చెపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాదులో ఈ నెల 15 నుంచి 19 వరకు నిర్వహిస్తుందని , అందులో భాగంగా మన జిల్లాలో రెండు రోజులు సాంస్కృతిక, కళారూప కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు.రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మన పండుగలుగా రాష్ట్ర పండుగలు ప్రకటించి , వాటిని ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.తెలుగు అంటే మొక్కుబడిగా చదవటం కాకుండా అది మనకు సంస్కారాన్ని నేర్పే బాషను ,మన మాతృ భాషను , మన సంస్కృతిని భావితరాలకు అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ ఎల్ .రాజయ్య, రామగుండం మున్సిపల్ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, పెద్దపల్లి , జగిత్యాల స్త్రీ, శిశు సంక్షేమ ప్రాంతీయ ఆర్గనైజర్ మూల విజయా రెడ్డి,జిల్లా ఇంచార్జీ డిఆర్‌డివో ప్రేమ్‌కుమార్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర రావు, జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి రాజవీరు, జిల్లా పౌరసంబంధాల అధికారి జి.వీరయ్య , జిల్లా అధికారులు , కవులు, రచయితలు, తదితరులు పాల్గొన్నారు.