Wednesday, September 18, 2024

హుస్సేన్‌సాగర్‌లో పిఒపి విగ్రహాల నిమజ్జనం వద్దు

- Advertisement -
- Advertisement -
Do not immerse POP idols in Hussain Sagar lake
తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పిఒపి)తో తయారైన వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీని, నగర పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సాగర్‌లో నీరు కలుషితం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నిమజ్జనాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేయాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం రిజర్వు చేసిన తీర్పును గురువారం వెల్లడించింది. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయడం లేదని కోర్టు దృష్టికి తీసుకొస్తూ మామిడి వేణు మాధవ్ అనే అడ్వకేట్ దాఖలు చేసిన కాంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గణేష చతుర్థి ఉత్సవాల్లో ప్లాస్టర్ ఆప్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని, అలాంటి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చని కోర్టు సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News